Breaking News : అర్జున్ రెడ్డి లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నటుడు మృతి.. షాక్ లో సందీప్ రెడ్డి వంగా

820

అర్జున్ రెడ్డి సినిమా అనేది టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. విజయ్‌ దేవరకొం‍డ హీరో సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్‌ హిట్ సినిమా అర్జున్‌ రెడ్డి. ఈ ఒక్క సక్సెస్‌తో విజయ్‌ స్టార్‌ హీరోగా మారిపోయాడు. అంతేకాదు దర్శకుడు సందీప్‌ రెడ్డికి కూడా అర్జున్‌ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది.తెలుగు సినిమా కూడా అర్జున్ రెడ్డికి ముందు అర్జున్ రెడ్డి తర్వాత అనే చెప్పుకునే స్థాయికి వచ్చింది. అర్జున్‌ రెడ్డి ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాలో తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కుతుంది. కబీర్ సింగ్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.

Image result for TAMIL Arjun reddy

అయితే సినిమా టీమ్‌ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ముస్సోరీలో షూటింగ్‌ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా అక్కడి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బస చేస్తోంది. ఈ క్రమంలో రామ్‌ కుమార్‌(35) అనే నటుడు ప్రమాదవశాత్తు జనరేటర్‌లో చిక్కుకుని చనిపోయాడు. జనరేటర్‌లో నీటి లెవల్‌ చెక్‌ చేస్తున్న సమయంలో అతడి మఫ్లర్‌ జనరేటర్‌ ఫ్యాన్‌కు చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఇతను సినిమాలో షాహిద్ కపూర్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలలో స్నేహితుల పాత్రలు కూడా చాలా ముఖ్యమైనవి. సినిమాకు వాళ్ళ పాత్రలు కూడా బలం. ఆ స్నేహితులలో ఒకడు ఇప్పుడు చనిపోవడంతో చిత్ర యూనిట్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాగా రామ్‌ కుమార్‌ మృతి పట్ల కబీర్‌ సింగ్‌ యూనిట్‌ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. రామ్‌ కుమార్‌ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం. అతడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. ఇక అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాతో బాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాలోనే ఇలా విషదం చోటుచేసుకోవడం సందీప్ ను బాధపెడుతోంది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మరి ఈ ప్రమాద ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.