BREAKING NEWS- సంగీత దిగ్గజం ఖయ్యాం కన్నుమూత

35

కభీ కభీ, ఉమ్రావ్‌జాన్ సహా వందలాది హిందీ చిత్రాల్లో తన అద్భుత స్వర రచనతో అజరామరగీతాలు అందించిన అలనాటి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఖయ్యాం సోమవారం రాత్రి మరణించారు…. బాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడిగా ఆయనకు పేరు ఉంది.. పద్మభూషణ్‌ అవార్డు కూడా ఆయన పొందారు…. సోమవారం కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఖయ్యాం ముంబైలోని సుజయ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 28న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌ అమర్చారు. అయితే సోమవారం రాత్రి 9.30 గంటలకు కార్డియాక్‌ అరెస్ట్‌ గుండె ఆగిపోవడం తో ఖయ్యాం తుదిశ్వాస విడిచారని సన్నిహితవర్గాలు తెలిపాయి.

ఈ క్రింద వీడియో చూడండి

లూథియానా నుంచి 17 ఏళ్లకే ఖయ్యాం సంగీత ప్రయాణం మొదలైంది. ‘ఉమ్రావ్‌ జాన్‌’ ‘కభీకభీ’ సినిమాలతో ఖయ్యాం పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ‘ఉమ్రావ్‌ జాన్‌’ సినిమాకు అందించిన సంగీతానికి గానూ ఖయ్యాంను జాతీయ అవార్డు వరించింది. కభీకభీ, ఉమ్రావ్‌ జాన్‌ సినిమాలకు ఫిలింఫేర్‌ అవార్డులు కూడా దక్కాయి. ఆయనకు 2007లో సంగీత నాటక అకాడమి అవార్డు వరించింది. అంతేకాకుండా 2011లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో ఖయ్యాంను సత్కరించింది. ఖయ్యాం మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖయ్యాం భౌతికకాయానికి అంతిమ సంస్కారం మంగళవారం జరుగుతుంది. హిందీ చలన చిత్ర రంగంలో తనదైన శైలిలో ఎన్నో అద్భుత గీతాలను అందించిన ఘనత ఖయ్యాంకు దక్కుతుంది. కాలం మారినా మాధుర్యం తగ్గని పాటలతో ఆయన మనకు అందించారు. త్రిశూల్, నూరీ, షోలా ఔర్ షబ్నం, ఫరఖ్ వంటి చిత్రాల్లోని పాటలు ఖయ్యాంకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టాయి.