బుల్లితెర మీద రచ్చ చేయడానికి వస్తున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం..

429

హాస్య బ్రహ్మ అంటే మనకు గుర్తుకువచ్చే ఒకేఒక్క పేరు బ్రహ్మానందం.ఒకప్పుడు బ్రహ్మానందం అంటే సినిమాల్లో హీరో తర్వాత హీరో అనే అభిప్రాయం ఉండేది. కొన్ని చిత్రాల విజయంలో ఆయనే హీరో అనే భావన కలిగేది. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో బ్రహ్మానందం తరహా కామెడీకి ఆధరణ తగ్గింది.సుమారు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలిన బ్రహ్మానందం సుమారు వెయ్యికిపైగా చిత్రాలతో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం పొందారు.

Image result for brahmanandam

అయితే, ఇటీవల ఆయన సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు.అందుకే ప్రేక్షకులను నవ్వించడానికి ఆయన మరొక మార్గంలో వెళ్తున్నారు.ఇన్ని రోజులు వెండితెర మీద నవ్వులు నవ్వించిన ఆయన ఇప్పుడు బుల్లితెర మీదకు వస్తున్నాడు.త్వరలో స్టార్‌ మాలో ప్రసారం కానున్న ‘ద గ్రేట్ తెలుగు లాఫర్ చాలెంజ్’ షో ద్వారా ఆయన న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు.

ఈ సందర్భంగా స్టార్ మా తమ అధికారిక ట్విట్టర్‌లో కార్యక్రమ ప్రోమో విడుదల చేసింది. ఇందులో బ్రహ్మానందం కంటెస్టెంట్‌లకు ఆహ్వానం పలుకుతూ ‘‘ఇంకా ఏంటి చూస్తున్నారు. మేమంతా రెడీ. మీరు రావడమే ఆలస్యం. వస్తే మొదలుపెట్టేద్దాం’’ అని పిలుపునిచ్చారు.చూడాలి మరి ఈ షో ద్వారా ఎన్ని నవ్వులు పూయిస్తాడో.