హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి మరొక అరుదైన పురస్కారం..

291

తెలుగు సినీ చరిత్రలో హాస్యనటుడు అంటే అందరికి ముందు గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం.తెలుగు సినిమా ఉన్నంతకాలం బ్రహ్మానందం పేరు ఉంటుంది.వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. అత్యధిక సినిమాల్లో నటించిన హాస్యనటుడిగా గిన్నిస్‌బుక్‌లోకి సైతం ఎక్కారు.సినీ కళామ్మతల్లికి ఆయన అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అందుకున్న ఈ హాస్య బ్రహ్మ.. తాజాగా మరో పురస్కారాన్ని అందుకున్నారు.

brhmanandam gurusri puraskaram కోసం చిత్ర ఫలితం

గత 20 ఏళ్లుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ‘గురుశ్రీ’ పురస్కారంతో బ్రహ్మానందాన్ని సన్మానించింది. కృష్ణాష్టమిని పురష్కరించుకుని చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతికి బంగారు కంకణాన్ని తొడిగారు.

brhmanandam gurusri puraskaram కోసం చిత్ర ఫలితం

పురస్కారం అందుకున్న సందర్బంగా బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘ఈ కృష్ణాష్టమి రోజున గురుశ్రీ పురస్కారంతో నన్ను అభినందించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులను నవ్వించేందుకే దేవుడు నన్ను పంపించాడు. అందుకే నేను మిమ్మల్ని నవ్విస్తున్నాను. మీ ఆదరాభిమానాలు ఉన్నంత వరకు మిమ్మల్ని నవ్వించే పనిలోనే ఉంటాను. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం.. ఇలా ప్రముఖులను అభినందించడం గొప్ప విషయం. కృష్ణాష్టమి రోజున నాకు గురుశ్రీ గౌరవాన్ని ఇవ్వడడం భగవత్ సంకల్పంగా భావిస్తున్నాను’ అని అన్నారు.