ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

517

ఇటీవ‌ల ప్ర‌ముఖుల మ‌ర‌ణాలు విషాదాన్నినింపుతున్నాయి.. సినిమా ఇండ‌స్ట్రీపై మ‌రింత దారుణ‌మైన ప్ర‌భావం చూపిస్తుంది అని చెప్పాలి.. ఇటీవ‌ల‌ చాలా మంది సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తులు మ‌ర‌ణించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతోంది.. సినిమా ఇండ‌స్ట్రీపై ఈ నిలినీడ‌లు ఏమిటా అని మ‌ద‌న‌డ‌పుతున్నారు ఇండ‌స్ట్రీ వ్య‌క్తులు.. బాలీవుడ్ లో ఇప్పుడు విషాద చాయ‌లు అల‌ముకున్నాయి ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ వ్య‌క్తి మ‌ర‌ణం జీర్ణించుకోలేక‌పోతున్నారు బాలీవుడ్ న‌టులు. ఆయ‌న వేసిన స్టెప్పులు హీరోల‌తో వేయించిన స్టెప్పులు సినిమాలో విజిల్స్ వేయించాయి కాని నేడు ఆయ‌న ఈ లోకం నుంచి విడిచి వెళ్లిపోయారు.

తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ బాలీవుడ్ కు చెందిన వ్య‌క్తి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ తదితరుల సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యాహ్నం ఆయన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన సూసైడ్ చేసుకున్న ప్రదేశంలో ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. తన అకౌంట్‌లో ఉన్న డబ్బంతా తన కూతురికి చెందాలని ఆ నోట్‌‌లో అభిజిత్ పేర్కొన్నారు. దీంతో ఒక్క‌సారిగా బాలీవుడ్ షాక్ అయ్యింది.

ఆయ‌న బ‌ల‌వ‌న‌ర్మ‌ర‌ణానికి పాల్ప‌డిన చోటుని ప‌రిశీలించి, ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు… ఆయన కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారని, డిప్రెషన్‌తో బాధ పడుతున్నారని అభిజిత్ భార్య పోలీసులకు తెలిపారు. అభిజిత్ భార్య మూడు నెలలుగా తన తల్లిగారింట్లో ఉంటోందని ఈ కేసును విచారిస్తున్న పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. రెండు సంవత్సరాల వయసున్న తన పాపను చూసుకునేందుకు అభిజిత్‌ను అతని భార్య అంగీకరించకపోవడంతో ఆయన చాలా మనోవేదనకు గురయ్యాడని ఖడే వెల్లడించారు. పోస్ట్‌మార్టం త‌ర్వాత అభిజిత్ మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అందజేస్తామని ఖడే తెలిపారు. అయితే ఇండ‌స్ట్రీలో వివాదాస్ప‌ద ఘ‌ట‌న‌లు అలాగే ఎవ‌రితో అయినా గొడవ‌లు జ‌రిగాయా అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.. కాని అభిజిత్ కు ఇండ‌స్ట్రీలో అంద‌రూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయ‌న‌కు ఎవ‌రూ వ్య‌తిరేకులు లేరు అని అంటున్నారు.. మొత్తానికి అభిజిత్ కు ఇటువంటి పరిస్దితి వ‌స్తుంది అని అనుకోలేదు అని, బాలీవుడ్ న‌టులు అంటున్నారు.. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం చాలా దారుణ‌మైంది అని, ఏనాడు తాను ఇంత బాధ‌లో ఉన్నాను అని చెప్ప‌లేదు అని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు..