అకిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..

385

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అకిల్ ఇప్పటివరకు సరైన హిట్ పొందలేదు.మొదటి సినిమా అకిల్ నిరాశపరచింది.రెండవ సినిమా హలో పరువలేదు అనిపించింది.అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.అఖిల్ ప్రస్తుతం తన మూడో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.తొలి ప్రేమ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు.

Farah Karimaee Special Song In Akhil New Film - Sakshi

 

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ నటి ఫరా కరిమీ ఆడిపాడనుందట.ధృవ సినిమాలో అరవింద్ స్వామి పక్కన ప్రత్యేక పాత్రలో నటించిన ఈ బ్యూటి అఖిల్ సరసన స్పెషల్ సాంగ్‌ చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంగ్లాండ్‌లో జరుగుతోంది.