లోక‌నాయ‌కుడితో బాలీవుడ్ హీరో

355

భారతీయుడు సినిమా ఎంత ఘ‌న విజయం సాధించిందో తెలిసిందే… ద‌ర్శ‌కుడు శంక‌ర్ అలాగే లోకనాయకుడు కమల్‌ హాసన్ ఈ సినిమాతో మ‌రో చ‌రిత్ర సృష్టించారు.. ఇప్ప‌టికీ ఈ సినిమా పై ఎక్క‌డో ఓ చోట చ‌ర్చ జ‌రుగుతుంది.. ఇక మ‌రోసారి లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ మ‌న‌ల్ని అల‌రించేందుకు ఈ సినిమా సీక్వెల్ తో వ‌స్తున్నారు.. శంక‌ర్ క‌మ‌ల్ భార‌తీయుడు సీక్వెల్ కు రెడీ అయ్యారు.. అయితే తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసనే చెప్పారు.

Image result for అజయ్‌ దేవగణ్‌

దీంతో ఈ సినిమా పై మ‌రింత ఎక్సెపెక్టేష‌న్స్ పెరిగిపోయాయి… భార‌తీయుడు సినిమా 2 లో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్నారు అని నాకు తెలిసింది ఈ సినిమాలో న‌టీ నటుల నిర్ణ‌యం పూర్తిగా మా ద‌ర్శ‌కుడు శంక‌ర్ నిర్ణ‌యం అని క‌మ‌ల్ అన్నారు.. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ లైకా ప్రొడ‌క్ష‌న్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి హిందీలో క్రేజ్ రావాలి అని అందుకే బాలీవుడ్ స్టార్ ల‌ను కూడా శంక‌ర్ తీసుకుంటున్నారు అని అంటున్నారు.

Image result for అజయ్‌ దేవగణ్‌

మ‌రి శంక‌ర్ ఆలోచ‌న ఏమై ఉంటుందా అనేది తెలియ‌క‌పోయినా, ఆ పాత్ర‌కు అజ‌య్ సూట్ అవుతారు అని ఆయ‌న్ని తీసుకుని ఉండ‌వ‌చ్చు అని అంటున్నారు… మొత్తానికి శంక‌ర్ ఇటు క‌మ‌ల్ అటు ర‌జ‌నీ సినిమాల‌తో ఈ రెండు సంవ‌త్స‌రాలు అల‌రించ‌నున్నాడు.