సోనాలి బింద్రే మరణించింది బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్

517

క్యాన్సర్ వ్యాధికి గురైన సొనాలి బింద్రే ఫారెన్ లో చికిత్స తీసుకుంటున్నారు.. ఆమె కోలుకోవాలి అని ఓ ప‌క్క ఆమె అభిమానులు, ఆమె కుటుంబ స‌భ్యులు కోరుకుంటున్నారు.. ఈ స‌మ‌యంలో ఓ సంచ‌ల‌న వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.. ఆమె మ‌ర‌ణించింది అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్ పెట్టారు. ఇది పెను దుమారం లేపింది.ఇప్పుడు స‌ద‌రు బీజేపీ ఎమ్మెల్యేకు చుక్క‌లు చూపిస్తున్నారు నెటిజ‌న్లు..
సోనాలి బింద్రే మరణించిందంటూ ట్వీట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్‌ ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నారు…దాంతో బీజేపీ ఇబ్బందిలో పడింది. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం రామ్ కదమ్‌కు తొలిసారి కాదు.

Image result for sonali bendre

 

గతంలో మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో కూరుకుపోయారు ఆయ‌న‌.హిందీ, మరాఠీ చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకొన్న సొనాలి బింద్రే ఇకలేరు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో కన్నుమూశారు అనే వార్త సోషల్ మీడియా‌లో వచ్చిన సందేశాన్ని రామ్ కదమ్ షేర్ చేశాడు. అయితే ఆ వార్త నిజమా? వాస్తవమేంతా అనే విషయాన్ని పట్టించుకోలేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది.సొనాలి బింద్రే మరణ వార్తపై అభిమానులు ఆందోళన చెందారు. ఫేక్ న్యూస్ అని తేలడంతో నెటిజెన్స్ రామ్ కదమ్‌ను ట్రోల్స్ చీల్చి చెండాడారు. దాంతో అసలు విషయం తెలుసుకొన్న రామ్ కదమ్, తన తప్పుకు క్షమాపణ చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయన తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.సొనాలి బింద్రేపై వచ్చిన మరణ వార్త రూమర్. అందులో వాస్తవం లేదు. గత రెండు రోజులుగా నేను బాధలో మునిగిపోయాను. చేసిన తప్పుకు చింతిస్తున్నాను. అని మ‌ళ్లీ పోస్టు పెట్టారు ఆయ‌న‌.సొనాలి బింద్రే ప్రస్తుతం అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొంటున్నారు. ఆమె వెంట భర్త గోల్డి బెహల్ ఉన్నారు. ఇటీవల ఆమె స్నేహితులు ప్రియాంకా చోప్రా తదితరులు కలుసుకొని నైతికంగా మద్దతు తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడిస్తున్నారు.ఆమె ఆరోగ్యం గురించిఇంత చ‌ర్చ జ‌రుగుతున్నా ఆయ‌న మాత్రం ఏమీ ప‌ట్ట‌నట్టు ఇలాంటి పోస్టు పెట్ట‌డం పై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.. మ‌రి మీరు ఏమంటారు ఇత‌ను పెట్టిన పోస్టుపై, మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.