‘తుపాకి రాముడు’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న బిత్తిరి సత్తి

314

తీన్మార్ వార్తలతో పాపులర్ యాంకర్‌గా మారిన బిత్తిరి సత్తి.పొడుగు పువ్వుల చొక్కా.. మోకాళ్ల కింద వరకూ ఉండే నిక్కరు.. నవ్వు పుట్టించేలా భారీ దేహం.. తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో తీన్ మార్ వార్తలతో అందరిని నవ్విస్తూ ఉంటాడు.ఆడియో వేడుకల్లోనూ, సెలబ్రిటీ ఈవెంట్స్‌లోనూ మెరుస్తున్నాడు. ఇటీవల చిన్న చిన్న పాత్రల్లో సినిమాల్లోనూ కనిపించిన బిత్తిరి సత్తి హీరోగా మారారు.

Image result for bithiri sathi tupaki ramudu

‘తుపాకి రాముడు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.‘బతుకమ్మ’ ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని, శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మోషన్ పోస్టర్‌, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు.

Image result for sukumar tupaki ramudu

బిత్తిరి సత్తి, ప్రియ, ఆర్.ఎస్. నందా, గౌతంరాజు, రవి ఆదేష్, అంబటి వెంకన్న, అనురాగ్, పోశం, మాధవి, గాయత్రి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, మాటలు: సిద్దార్ధ, రవి ఆదేష్, ఎడిటింగ్: జె.పి., పాటలు: అభినయ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మక్కపాటి చంద్రశేఖర్‌రావు, మక్బుల్ హుస్సేన్, నిర్మాత: రసమయి బాలకిషన్; రచన-సంగీతం-దర్శకత్వం: టి. ప్రభాకర్.