నీ –ఉన్న ఆ బ్లాక్ స్పాట్ …శ్రీ ముఖి పై బిత్తిరి హాట్ కామెంట్స్ ..బోరున ఏడ్చేసిన శ్రీముఖి

405

ప్రస్తుతం చిన్న విషయాన్ని కూడా హాట్ టాపిక్ గా మార్చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. ఎన్నో సమస్యలని పక్కన పెట్టేసి చిన్న విన్న వివాదసంఘటనలపై డిబేట్లు పెడుతూ సంచలనమైన వార్త అంటూ చూపిస్తున్నాయి.తాజాగా అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. నటుడు, యాంకర్ అయిన బిత్తిరి సత్తి ఎంత సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. ఓ ఛానల్ లో వచ్చే అతడి షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే బిత్తిరి సత్తి నటుడిగా కూడా రాణిస్తున్నాడు. ఇటీవల దిక్సూచి ఆడియో వేడుకలో బిత్తిరి సత్తి శ్రీముఖిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొన్ని మీడియా సంస్థల్లో డిబేట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి సత్తి కామెంట్స్ ని శ్రీముఖి సరదాగానే తీసుకుంది.

నీకు చేతకాదు

దిక్సూచి ఆడియో వేడుకలో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. ఈ చిత్రంలో బిత్తిరి సత్తి కీలక పాత్రలో నటించాడు. ఓ పాటని కూడా పాడాడు. సత్తిని వేదికపైకి ఆహ్వానించే సమయంలో.. ఫాలకూర స్టార్ బిత్తిరి సత్తి అదిరిపోయే డ్రెస్ వేసుకుని వచ్చాడు. పెళ్లి కొడుకులా రెడీ అయి వచ్చిన సత్తి ముందు మేము సరిపోతామో లేదో అని శ్రీముఖి వ్యాఖ్యానించింది. సత్తి వేదికపైకి రాగానే శ్రీముఖిని ఉద్దేశించి అంతే సరదాగా స్పందించాడు. సత్తి వేదికపైకి రాగానే ముందుగా అందరికి శుభ సాయంత్రం చెబుతాం.. ఆ తర్వాత మనం మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి అని సత్తి అన్నాడు. నీకు సంప్రదాయమైన బట్టలు వేసుకోవడం చేతకాదు.. వేసుకోలేవు అని సత్తి శ్రీముఖిని ఉద్దేశించి అన్నాడు.

 మీరు చూడడానికే వేసుకుంటాం

దీనికి శ్రీముఖి బదులిస్తూ.. ఇప్పుడు నేనేసుకున్నబట్టలు సాంప్రదాయంగా లేవా.. ఇవి సంప్రదాయమైన బట్టలు కాకపోతే పప్పు చారు అన్నం అంటారా అని ప్రశ్నించింది. డ్రెస్ మొత్తం బాగానే ఉంది. కానీ మెడ భాగంలో మాత్రమే ఆ డిజైన్ ఏంటి అంటూ సత్తి సరదాగా ప్రశ్నించాడు. శ్రీముఖి కూడా సత్తి ప్రశ్నకు సరదాగానే సమాధానం ఇచ్చింది. డ్రెస్ మొత్తం వదిలేసి మెడ వద్ద మాత్రమే ఎందుకు చూస్తున్నావు. ఇలాంటి మగాళ్లు చూస్తారు కాబట్టే మేము ఈ డ్రెస్సులు వేసుకుంటున్నాం అని శ్రీముఖి బదులిచ్చింది. పేపర్ మొత్తం తెల్లగా ఉన్నా చిన్న మచ్చ ఉంటెదానినే చూస్తాం కదా అని సత్తి సమాధానం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు సరదగా అనిపించడంతో వైరల్ అయ్యాయి.

కానీ కొన్ని టివి ఛానల్స్ లో మాత్రం సత్తి కామెంట్స్ పై హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. కొన్ని రోజుల క్రితమే లవర్స్ డే ఆడియో వేడుకలో కమెడియన్ అలీ యాంకర్ సుమని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. బిత్తిరి సత్తి శ్రీముఖిపై శారద కామెంట్స్ తర్వాత దిక్సూచి చిత్రంలో ఓ పాటని అద్భుతంగా పాడాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. నేనే రాజు నేనే మంత్రి, మరి కొన్ని చిత్రాల్లో సత్తి నటించాడు. సత్తికి పలు చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.