నా పెళ్లాన్ని గెలికావు.. అలానే చేస్తావా? వరుణ్ సందేశ్, మహేష్ విట్టా ఫైట్

603

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3లో సెలబ్రిటీల మధ్య విబేధాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. ఒకరంటే మరొకరికి పడనంతగా అభిప్రాయ బేధాలు భగ్గుమన్నాయి. నాలుగో రోజు కార్యక్రమంలో హేమ, రాహుల్, హేమ-శ్రీముఖి మధ్య, అలాగే వరుణ్ సందేశ్ దంపతులు మహెష్ మధ్య గొడవలు తారస్థాయికి చేరుకొన్నాయి. అసలు వీరి మధ్య గొడవలు ఎందుకయ్యాయి. ఆ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for mahesh vitta and varun sandesh

లగ్జరీ బడ్జెట్ టాస్క్ సందర్భంగా హేమ, రాహుల్ మధ్య గొడవ జరిగిన తర్వాత ఇంటి సభ్యులు సముదాయించడంతో ఇళ్లంతా ప్రశాంతంగా కనిపించింది. ఇక లాన్‌లో చేరిన శ్రీముఖి, బాబా భాస్కర్, హేమ, జాఫర్, మహేష్ విట్ట ఆటవిడుపుగా బాహుబలి స్కూప్ చేశారు. ప్రభువుగా జాఫర్, రాణిగా హేమ నటించారు. హేమ, జాఫర్ మధ్య జరిగిన సంభాషణ ఇంటి సభ్యులకే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఇక ఇంటిలోని లేడీ సెలబ్రిటీలు హంగామా చేశారు. పైజామా పార్టీ అంటూ సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. అందరం పైజామాలు వేసుకొని ట్రెండ్ క్రియేట్ చేశాం అని బిగ్‌బాస్‌కు చెబుతూ ఇంటిలోని కెమెరాలకు ఫోజులిచ్చారు. బిగ్‌బాస్ కెమెరా ముందు అందరూ కలిసి సెల్ఫీ దిగారు. బడ్జెట్ టాస్క్ తర్వాత అంతా ప్రశాంతమే అనుకొన్న సమయంలో మహేష్ విట్ట, వరుణ్ సందేశ్ మధ్య భారీగా గొడవ జరిగింది. అసలేం జరిగిందంటే… మహేష్ డోర్ దగ్గర నిలబడ్డాడు. అయితే అప్పుడు బయటకు వెళ్లాలని వితికా వచ్చింది. అయితే చెయ్యి అడ్డు తీయమని వితికా అంటే చెయ్యి పైకి ఎత్తి కిందనుంచి వెళ్ళమన్నాడు. దానికి వితికాకు కోపం వచ్చింది.

ఈ క్రింద వీడియోని చూడండి

మహేష్ కు మ్యానస్ లేదని వితికా అనడంతో మహేష్ కు కోపం వచ్చింది. వితిక షేరు విషయంలో మాటలు చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. మహేష్ విట్టపై వరుణ్ సందేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్య సముదాయించినప్పటికీ వరుణ్ కోపంతో మహేష్‌పైకి దూకినంత పనిచేశాడు. మహేష్, వరుణ్ సందేశ్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగింది. నా భార్యతో అగౌరవంగా ప్రవర్తిస్తావా? అసలు నీకు ఏం తెలుసు? ఆడవాళ్లతో మాట్లాడే పద్దతి ఇదేనా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. నన్నుకొట్టి సారు చెప్పు. నీ సంగతి చూస్తా అంటూ ఊగిపోయాడు. ఇంటి సభ్యుల జోక్యంతో కాస్త గొడవ దారికి వచ్చినట్టు కనిపించింది. అయితే అంతటి ఆగకుండా ఐదోరోజు కూడా గొడవ తీవ్రస్థాయిలో జరిగిందనే సూచనలు కనిపించాయి. ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో కూడా వరుణ్ కు మహేష్ కు మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ లో ఎంత రగడ జరుగుతుందో.. మరి వితికాకు,మహేష్ కు మధ్య జరిగిన గొడవ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.