హేమను టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు..హేమ , రాహుల మధ్య గొడవ పెట్టిన శ్రీముఖి

166

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 రోజురోజుకు ఆకస్తిని రేపుతోంది. స్టార్ట్ అయ్యి మూడే రోజులు అయ్యింది. అప్పుడే ఇంట్లో రచ్చ రచ్చ జరుగుతుంది. మూడో రోజు కార్యక్రమంలో సెలబ్రీటల మధ్య గొడవలు జోరుగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం హ్యాపీగా ప్రారంభమైన ఈ షోలో గందరగోళం నెలకొన్నది. హేమ, ఇతర సభ్యుల మధ్య గట్టిగానే వాగ్వాదాలు జరిగాయి. దాంతో ఇంటి సభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌లో ఇంట్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకొన్నాయి. ఒకరికి ఇంకోకరికి మధ్య గొడవలు అప్పుడే మొదలయ్యాయి. నటి హేమ, హిమజ మధ్య మాటల యుద్ధం ఊపందుకొన్నది. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇంటి సభ్యుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నది.

Image result for bigboss house members  photos telugu season 3

మూడో రోజు ఏం జరిగిందంటే.. బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు సరదా సరదా సాగే ఆటను టాస్క్‌గా బిగ్‌బాస్ ఇచ్చారు. సెలబ్రిటీలందరూ చిన్న పిల్లల మాదిరిగా మారిపోయి అల్లరి చేశారు. టాస్క్‌లో భాగంగా సెలబ్రిటీలు కిడ్స్ మాదిరిగా తమ ప్రదర్శన ఆకట్టుకొన్నారు. టాస్క్ చిన్న చిన్న తుంటరి అంశాలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ టాస్క్‌కు పునర్ నవి టీచర్‌గా వ్యవహరించారు. బాబా భాస్కర్‌ను సిగరెట్ తాగకుండా ఆపడంలో ఇంటి సభ్యులు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత రవికృష్ణ, మహేష్ విట్ట మధ్య గొడవ చోటు చేసుకొన్నది. మహేష్‌ను ఉద్దేశించి కర్రోడా అంటూ పిలిచే సరికి ఆయన మండిపడ్డారు. రవికృష్ణను ఉద్దేశించి నీవు చదువుకొన్నవాడివేనా అంటూ మహేష్ విట్ట ఫైర్ అయ్యాడు. చదువుకొన్న వాడు పక్కన ఉండే వాడిని అలా పిలువరు అని క్లాస్ పీకాడు. ఇలా బాడీ షేమింగ్‌పై మహేష్ దీటుగా స్పందించే సరికి రవికృష్ణ కామ్ అయ్యారు.

ఈ క్రింద వీడియోని చూడండి

ఫుడ్ విషయంలో ఇంటి పెద్దగా వ్యవహరిస్తున్న హేమతో, రాహుల్, అలీ రాజా, శ్రీముఖి గొడవ జరిగింది. మూడు రోజులపాటు ఫుడ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని హేమ చెప్పడంపై కొందరు వ్యతిరేకించారు. హేమతో రాహుల్‌ వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య మాటలు జోరు పెరిగింది. దాంతో ఎదుటివాళ్లు చెప్పాలని రాహుల్ నిలదీశాడు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, హిమజ ఇతర సెలబ్రీటీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపించింది. ఎవరి వ్యూహాలతో వారు ఉన్నట్టు వ్యవహరించారు. అందరి దృష్టి ఇక హేమపైనే ఉంది. హేమను అక్కా అంటూనే కొందరు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో హేమ కూడా సహనం కోల్పోయేలా కనిపిస్తున్నది. ఇలా మూడో రోజు ముగిసింది. చూడాలి మరి రానురాను ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో.. మరి బిగ్ బాస్ మూడవ రోజు జరిగిన ఈ ఘర్షణల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.