బిగ్ బాస్ టాస్క‌లో అప‌శృతి నొప్పి భ‌రించ‌లేక ఏడ్చేసిన దీప్తిన‌ల్ల‌మోతు షాకైన బిగ్ బాస్

627

బిగ్ బాస్ టాస్క్ లు రోజు రోజుకు కాస్త డిఫ‌రెంట్ గా ప్ర‌య‌త్నం చేయ‌డంతో షోలో ర‌స‌వ‌త్త‌ర‌మైన ఆట‌తో పాటు సీరియ‌స్ గా గేమ్ ఆడాలి అనే క‌సితో ఇబ్బందులు కూడా ప‌డుతున్నారు… ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చే చిన్న టాస్క్ లు అయితే ప‌ర్వాలేదు కాని , ఇప్పుడు మాత్రం కాస్త రిస్కీ గేమ్స్ ఇస్తున్నారు బిగ్ బాస్.. తాజాగా నిన్న‌షోలో జ‌రిగిన ఓ అప‌శృతి బిగ్ బాస్ ని కూడా కంగారు పెట్టించింది.ఉదయం మొదలైన గేమ్ మధ్యాహ్నం వరకూ సాగింది. వాలుగా ఉండే చెక్క బల్లపై ఒకరు పడుకోవడం, మరి కొందరు కలిసి వాళ్లను అక్కడ నుంచి కదిలించడానికి ప్రయత్నించడం. బల్లమీద పడుకున్న వారి శరీర భాగం ఏది నేలకు తాకినా వాళ్లు ఔట్ అయినట్టు బిగ్ బాస్ ఈ టాస్క్ ను ఇచ్చారు.

Image result for tv9 deepthi in bigg boss house

ఒక్కసారి బల్లమీద పడుకున్నాకా తినడానికో, బాత్రూమ్‌కు వెళ్లడానికో కూడా వెళ్లకూడదు అనేది కండీషన్. ఈ గేమ్‌కోసం కంటెస్టంట్లను టీమ్‌లుగా విడదీశారు. బల్ల మీద పడుకునే వారికి సర్వైవర్స్‌గా, బల్లమీద నుంచి వాళ్లను లాగే వాళ్లను పైరేట్స్‌గా నామకరణం చేశారు. ఈ పైరేట్స్ వర్సెస్ సర్వైవర్స్‌లో నేడు సర్వైవర్స్‌గా ఉండే వారు రేపు పైరేట్స్ అవుతారనే విషయాన్ని కూడా ముందుగానే ప్రకటించాడు బిగ్‌బాస్.

Image result for tv9 deepthi in bigg boss house

పాల్గొన్న వారు కనీసం బ్రష్ కూడా చేసుకోకుండానే గేమ్ మొదలైంది. చేప‌ల‌తో ఏడిపించ‌డంతో గీతమాధురి కొన్ని నిమిషాల్లోనే బల్ల మీద నుంచి కింద పడిపోయింది. ఆ తర్వాత సునయనను పైరేట్స్ బలవంతంగా లాగేశారు. ఇలా దించే ప్రయత్నంలో బల్లకూ, దానికి ఉన్న కడ్డీకి మధ్యలో దీప్తి కాలు ఇరుక్కొంది. దీంతో ఆమె నొప్పితో విలవిల్లాడింది. ఇలా ఉదయం 11 వరకూ పోరాడారు. గేమ్ అయిపోయిందనుకున్న దశలో కథను బిగ్‌బాస్ అనూహ్య మలుపు తిప్పాడు.

త‌నీష్ ని క‌న్ఫెష‌న్ రూమ్ కి పిలిచి ఇది స‌రైన ఆట‌కాద‌ని, బ‌ల్ల‌లు పైకెత్తి సర్వైవర్స్ ను కింద పడేయడం సరికాదని అన్నారు, అందరూ తప్పుగా ఆడారని మళ్లీ గేమ్‌ను మొదలుపెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో మళ్లీ ఈ గేమ్ మొదలైంది. ఈ గేమ్‌లో దీప్తీ, పూజా రామచంద్రన్ ఇలా ఆడవాళ్లే తమ బలనిరూపణ చేసుకున్నారు. మేల్ పార్టిసిపెంట్స్ చేతులెత్తేయగా, వాళ్లు పోరాడారు. ఇక దీప్తి విష‌యంలో నందిని కౌశ‌ల్ ఇద్ద‌రూ ఆమెని దించే ప్ర‌య‌త్నంలో కౌశ‌ల్ నందిని స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌క‌పోవ‌డంతో దీప్తి కాలు బెణికింది…. ఇక నందిని ఈ విష‌యంలో కౌశ‌ల్ దే త‌ప్పు అని అన‌డంతో కౌశ‌ల్ మళ్లీ సెంట‌ర్ అయ్యాడు.

జగన్ కు మద్దతుగా యనమల వ్యాఖ్యలు…షాక్ లో చంద్రబాబు