బిగ్ బాస్ ఎపిసోడ్ 51 లో రచ్చ రచ్చ..ఒకరికి ఒకరు టార్చర్ అంటే ఏమిటో చూపించుకున్నారు..

524

బిగ్ బాస్ రోజురోజుకు ఆసక్తిగా మారుతుంది.ఇప్పటికే 50 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది.ఇప్పటివరకు చాలా ఆసక్తికర విషయాలు జరిగాయి.కొంతమంది అయితే అభిమానుల మనసు గెలుచుకుంటే మరి కొందరు ప్రేక్షకులలో విలన్స్ అయ్యారు.ఇప్పటివరకు బాగానే ఉంది.ఇక 50 వ ఎపిసోడ్ లో చాలా ఆసక్తికర విషయాలు జరిగాయి.నెంబర్ బోర్డ్ ఇచ్చి మీరు ఇంట్లో ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి అంటే అందరు తలా ఒక నెంబర్ ఎంచుకున్నారు.అయితే 3 స్థానం కోసం కౌశల్, దీప్తిలు పోటీ పడ్డారు. చివరి వరకూ ఇద్దరూ 3 స్థానం ఎంపికలో వెనక్కి తగ్గలేదు. ఇద్దరూ 3వ స్థానంలోనే నిలబడ్డారు.ఇలా నెంబర్ 4. సామ్రాట్ నెంబర్ 5. అమిత్ నెంబర్ 6. సునయన నెంబర్ 7. బాబు గోగినేని నెంబర్ 8. గణేష్ నెంబర్ 9. నందిని నెంబర్ 10. ఎవరూ ఎంపిక చేసుకోలేదు. నెంబర్ 11. గీతా మాధురి నెంబర్ 12. పూజా రామ చంద్రన్ లు నిలబడ్డారు.

Related image

నేటి ర్యాంక్ బోర్డ్ టాస్క్ ఇచ్చింది సరదాగా కాదని.. మీరు ఎంచుకున్న నంబర్ల ఆధారంగానే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందని చివర్లో బాంబ్ పేల్చారు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్స్ ఎంచుకున్న స్థానాల ఆధారంగా తొలి 6 స్థానాలకు ఎంచుకున్నవాళ్లు ఈ వారం ఎలిమినేషన్‌లో ఉండరని.. 7 నుండి 12 వరకూ స్థానాలను ఎంచుకున్న వాళ్లు ఈ వారం ఎలిమినేషన్‌లో ఉంటారన్నారు. అయితే 11 వ స్థానంలో ఉన్న గీతా మాధురి ఈ వారం కెప్టెన్‌గా ఉండటం వల్ల, 12వ స్థానాన్ని ఎంచుకున్న పూజా రామచంద్రన్ ఈ వారమే బిగ్ బాస్ హౌస్‌కి రావడం వల్ల మినహాయింపు ఇచ్చారు. అయితే 3 వ స్థానం కోసం పోటీపడిన కౌశల్, దీప్తిలు ఇద్దరూ 3వ స్థానంలోనే ఉండటం వల్ల కౌశల్, దీప్తి నల్లమోతులను ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు బిగ్ బాస్. దీంతో ఈ వారం ఎలిమేషన్‌లో కౌశల్, దీప్తిలతో పాటు బాబు గోగినేని, గణేష్, నందినిలు వచ్చి చేరారు. దీంతో ఈ ఐదుగురిలో ఒకరు, లేదా ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌ను వీడొచ్చు.

Related image

ఇది ఇలా ఉంటె మంగళవారం ఎపిసోడ్ 51 కు సంబంధించి ఒక ప్రోమోను విడుదల చేశాడు.అందులో లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు.ఇందులో ఎవరి ఇండివిజుయాల్ టాస్క్ ఇచ్చాడు.ఒక బల్లను ఇచ్చి దాని మీద ఉండాలి.అయితే మిగతా ఇంటి సభ్యులు అందరు కలిసి ఆమెను కిందికి దించాలి.అలా వాళ్ళు ట్రై చేసిన కూడా ఆమె కింద పడకూడదు.అలా ఉంటేనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ విన్ అయినట్టు ప్రకటించాడు.అయితే ఇక్కడే ఇంటి సభ్యులకు ఒక కండిషన్ పెట్టాడు.బల్ల మీద ఉన్న ఇంటి సభ్యుడిని మిగతా ఇంటి సభ్యులు టచ్ చెయ్యకుండా వాళ్ళను కిందికి దించాలి.

అలా దించడానికి వాళ్లకు టైం లిమిట్ ఉంటుంది.ఆ టైం లోపలనే వాళ్ళను కిందికి దించాలి.అయితే వాళ్ళను కిందికి దించడానికి ఇంటి సభ్యులకు కొన్ని ఆయుదాలాంటివి ఇచ్చారు.కొన్ని తాడ్లు చైన్స్ లాంటివి ఇచ్చారు.వీటిని ఉపయోగించే వారిని కిందికి దించాలి.ఇలా ప్రతి ఒక్కరు నానా తంటాలు పడ్డారు.మరి ఎవరెవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో తెలియాలంటే ఈరోజు ప్లే అయ్యే ఎపిసోడ్ వరకు ఎదురుచుడాల్సిందే.మరి బిగ్ బాస్ గురించి అలాగే బిగ్ బాస్ లో వాళ్ళు ఇచ్చే టాస్క్ ల గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

మంత్రులు నారాయణ సోమిరెడ్డి మధ్య భగ్గుమన్న విభేదాలు..చంద్రబాబు కు షాక్