మళ్లీ లీకైన బిగ్ బాస్-2 ఓట్లు.. ఈసారి ఇద్దరు ఎలిమినేషన్, ఎవరో తెలుసా.

631

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో విజయవంతంగా సాగుతోంది. సభ్యులతో నాని జరుపుతున్న సంభాషణకు ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.అయితే బిగ్ బాస్ టీం ను లీకులు బయపెడుతున్నాయి.బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమాచారం బయటకు వస్తుంది.అయితే ఇప్పుడు మరో అడుగు ముందేసి ఈ వారం ఎవరు బలహీనమైన అభ్యర్థి, ఎవరు అవుట్ కానున్నారనే విషయాన్ని వెల్లడించే ఓ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చాలా పకడ్బందీగా, సీక్రెట్‌గా కొనసాగే ఈ రియాలిటీ షో నిబంధనలకు విరుద్ధంగా ముందే బజారున పడటం స్టార్ మా నిర్వాహకులకు తలనొప్పిగా మారింది.ఈవారం ఎవరు ఎలిమినేట అవ్వబోతున్నారో తెలుసుకుందామా.

Image result for big boss telugu vote

ఏడో వారం ఎలిమినేషన్ లో కౌశల్ బాబు గోగినేని గణేష్,దీప్తి నల్లమోతు,నందినిలు ఉన్నారు.ఈ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని జనం చాలా ఆసక్తితో ఉన్నారు.అయితే ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం లీక్ అయ్యింది.ఈ ఐదుగురిలో కౌశల్ ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు.ఇక గోగినేని కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నా కూడా కేవలం కౌశల్ ఒక్కడినే టార్గెట్ చేస్తుండడంతో ఆయన మీద వ్యక్తిరేకత వచ్చింది.ఇక నందిని దీప్తి కూడా కౌశల్ తో కోల్డ్ వార్ నడిపిస్తున్నారు.

Image result for big boss telugu contestants

ఇక గణేష్ గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏం లేదు.అయితే ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న విషయం బయటపడింది.కౌశల్ కు భీభత్సంగా ఓట్లు వచ్చాయి.ఎప్పుడు లేని విధంగా ఈ వారం కౌశల్ ఆర్మీ స్ట్రాటజీ మార్చింది.అతనికి తప్పా ఇంకెవరికి ఓట్లు వెయ్యకూడదు అని డిసైడ్ అయ్యి అతనికి ఎక్కువ ఓట్లు వచ్చే విదంగా సోషల్ మీడియాలో కంపైన్ నిర్వహించారు.బిగ్ బాస్ చరిత్రలో ఇన్ని ఓట్లు ఎవ్వరికి రాలేదు.

ఆ తర్వాత స్థానంలో దీప్తి నల్లమోతు గణేష్ ఉన్నారు.ఇక మిగిలింది నందిని బాబు గోగినేని ఉన్నారు.వీళ్ళిద్దరికీ ఆల్మోస్ట్ సమానంగా ఓట్లు వచ్చాయి.చివరి స్థానంలో నందిని ఉంది.ఈవారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.ఎందుకంటే ఇంటి లోపలికి ఇద్దరు రీ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఈవారం ఇద్దరి ఎలిమినేషన్ ఉండొచ్చని అనుకుంటున్నారు.ఒకవేళ ఇద్దరి ఎలిమినేషన్ ఉంటె గోగినేని మరియు నందిని ఇంటికి వెళ్ళిపోతారు.ఒకవేళ ఒకరి ఎలిమినేషనే ఉంటె నందిని ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఖాయం.కౌశల్ కు వ్యతిరేకంగా గ్రూప్స్ కట్టడం వలనే వీరిద్దరూ ఇప్పుడు డేంజర్ లో పడ్డారు.మరి వీరిద్దరూ ఎలిమినేట్ అవుతారా..లేకుంటే ఒకరే అవుతారా అన్నది చూడాలి.మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటూన్నారు.సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేస్తున్న రచ్చ గురించి అతనితో ఎవరైతే వివాదం పెట్టుకుంటారో వాళ్ళే వెళ్ళిపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.