బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ పై సంజన సంచలన వ్యాఖ్యలు..

415

కాస్టింగ్ కౌచ్..తెలుగు ఇండస్ట్రీ లో సమాధానం లేని ప్రశ్న..సమాధానం లేదనే కన్నా క్లారిటీ లేదని చెప్పాలి..ఎప్పుడైతే శ్రీ రెడ్డి ఈ వివాదాన్ని బయటకు లాగి అందరినీ బజారు కీడ్చిందో అప్పటి నుంచి అందరు సెలబ్రితీలకు ఎదురవుతున్న ప్రశ్న ఇది…ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు కొందరు కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు.. కొందరు లేదన్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన అన్నె బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందా అన్నదానిపై స్పందించారు.సంజన అన్నె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ లేదు. ఎవరైతే నిర్వహిస్తున్నారో వారంతా గోల్డ్.. బంగారం లాంటి వారు.. కాస్టింగ్ కౌచ్ లేదు కానీ అందులో రాజకీయాలు మాత్రం ఉన్నాయి. అందుకే తొలివారమే నన్ను జైల్లో పెట్టి ఎలిమినేట్ అయ్యేలా చేశారు’ అని ఆరోపించారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ సంజన అన్నె. మోడల్ గా రాణించి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఈమె హౌస్ లో ఒక్క వారమే ఉంది. తనను అన్యాయంగా బిగ్ బాస్ టీం రాజకీయాలు చేసి వెళ్లగొట్టారని మండిపడింది. నాని కంటే గత సీజన్ లో ఎన్టీఆర్ బాగా చేశాడని.. ఎన్టీఆర్ ఐఫోన్ లా చేస్తే నాని ఫీచర్ ఫోన్ లా చేశాడని సంజన నోరుపారేసుకుంది. ఆ వివాదాలు ఇంకా చల్లారకముందే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటూ మరోసారి మాట్లాడి వార్తల్లో నిలిచింది.