ముద్దుల వల్ల సినిమాల్లో అలాజరిగింది మడోన్నా

420

మలయాళంలో రూపొందిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్.. తెలుగులో రూపొందిన రీమేక్లో కూడా అదే పాత్రలో ఆమె నటించి మంచి పేరు సంపాదించింది… ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్న మడోన్నా హీరో విజయ్సేతుపతితో మూడోసారి జతకట్టింది… అయితే ఆమెకు సక్సెస్ లు ఉన్నాయి, కాని అన్ని సినిమాలు చేసేందుకు ఆమె ఒకే చెప్పడంలేదు.. ఆమె కమర్షియల్ సినిమాలకు నో అంటోంది..కమర్షియల్ సినిమా హీరోయిన్ తరహాలో తాను నటించలేనని అందుకే సినిమా అవకాశాలు రావడం లేదని మడోన్నా చెప్పింది.

Image result for madonna sebastianనేను లిప్లాక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధంగా లేను. ముద్దు సన్నివేశాల్లో నటించలేను అని చెప్పినందుకు మూడు సినిమాలు పోగొట్టుకున్నాను అని చెప్పింది ఈ భామ… తొలిసారి హీరోని కౌగలించకునే సన్నివేశంలో నటించినప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చేసింది… కాని అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేశాను అనిచెప్పింది ఈ భామ.. నాకు సిగ్గు చాలా ఎక్కువ. అబ్బాయిలతో మాట్లాడడానికే చాలా భయపడతానని మడోన్నా చెప్పింది.. ఇక్కడ వరకూ బాగానే ఉంది మరి నిర్మాతలు దర్శకులు కోట్లు పెట్టి సినిమాతీసేది, హీరోయిన్ల తో మరికాస్త జనాలని రప్పించడానికే కాని ఇలా వాటికి నో అంటే అవకాశాలు రావు అని కొందరు నేరుగానే ఆమెకు చెబుతున్నారు.