బండ్ల గణేష్ ఆరోగ్యం విషయం కేర్ ఆస్పత్రికి తరలి వస్తున్న స్టార్ హీరోలు

534

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలవ్వడానికి కొన్ని రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మీడియా ఇంటర్వ్యూల్లో తనదైన శైలి వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. ఇక పార్టీలో ఆయ‌న స్పీడుని మాట‌లో చురుకుద‌నం చూసి ఆయనకు పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ద‌వికూడా ఇచ్చింది, క‌చ్చితంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒక‌వేళ గెల‌వ‌క‌పోతే తాను పీక కోసుకుంటాను అని సంచ‌ల‌న కామెంట్లు చేశారు ఆయ‌న‌. బండ్ల గ‌ణేష్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్వ్యూ చూస్తున్న వారిలో మాత్రమే కాదు… ఆయన్ను ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులను సైతం నవ్వించాయి. ఆయన సీరియస్‌గానే తన ఓపీనియన్స్ చెబుతున్నా… ప్రజలకు మాత్రం కామెడీ స్టైల్‌లో రీచ్ అయ్యాయి. అయితే ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

Image result for bandla ganesh

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక పోతే మీరు డిసెంబర్ 11న బ్లేడు తీసుకుని రండి, ఇదే ప్లేసులో అందరి ముందు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను, గెలిస్తే మీరు నాకు స్వీట్లు ఇవ్వాలి…. అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.రాజకీయాల్లో ఇలాంటి మాటలు చెప్పడం మామూలేనని అనుకున్నారు. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నేను చెప్పింది చేసి తీరుతానని తేల్చి చెప్పారు.. తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసిన త‌ర్వాత గణేష్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు అని తెలుస్తోంది. తన ఇంటిలో ఉన్న స‌మ‌యంలో ఈ ట్రోలింగ్స్ చూసి రేపు ఎక్క‌డ సినిమా ఫంక్ష‌న్ల‌కు వెల్లినా త‌న‌ని ఇలా గేలి చేస్తారు అని మ‌ద‌న‌ప‌డ్డార‌ట‌.ఈ స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో కూడా చెప్పి బాధ‌ప‌డ్డారు అని చెబుతున్నారు.. ఇక అనుకోకుండా స‌డెన్ గా గుండె పోటు రావ‌డంతో ఆయ‌న‌ని కేర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు అని తెలుస్తోంది… ఇప్ప‌టికే ఆయ‌న‌ని ప‌రామ‌ర్శించేందుకు ప‌వర్ స్టార్, ర‌వితేజ వ‌స్తున్నారు అని ఓ మెసేజ్ సోష‌ల్ మీడియాలో వార్త‌గా మారింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఆయ‌న రెండు రోజులుగా క‌నిపించ‌క‌పోవ‌డంతో బండ్ల గ‌ణేష్ ఎక్క‌డ ఉన్నారు అని మీడియా కూడా ఆయ‌న కోసం వెతుకుతోంది.. అయితే దీనిపై మీడియా ప్ర‌శ్నించ‌గా ఇది వాస్త‌వం కాదు అని తేల్చారు కుటుంబం .దీంతో సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ దీనిపై రాత‌లు రాస్తున్నారు….బండ్ల అన్నా మీరు ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోవ‌ద్దు, మీరు స‌ర‌దాగా అన్నారు రాజ‌కీయాల్లో ఇలాంటివి కామన్ అని స‌ల‌హ ఇస్తున్నార‌ట అభిమానులు, మీరు వారానికి ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చి మ‌మ్మ‌ల్ని ఎంట‌ర్ టైన్ చేయాలి అని కోరుతున్నారు. మ‌రి చూడాలి బండ్ల గ‌ణేష్ వ‌చ్చి మీడియా ముందు ఏదో ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెబుతున్నారు ఆయ‌న అభిమానులు.