నాగశౌర్యకు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..ఎందుకో చూడండి..

466

సోషల్ మీడియా పుణ్యమా అని లోకంలో ఎక్కడ ఏం జరిగినా అన్ని బయటకు వస్తున్నాయి.ముఖ్యంగా సినిమా వార్తలు అన్నా సినిమా నటుల విషయాలు అన్నా ఇట్టే బయటకు వస్తాయి.తాజాగా అలాంటిది తాజాగా సోషల్ మీడియా లో వెలుగుచూసింది.

‘యంగ్ హీరో నాగ శౌర్య కు ఇటీవల బాలకృష్ణ ఫోన్ చేసి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చాడు.. ఏం చెయ్యాలో తెలియక ఆ యువ హీరో భయం లో ఉండిపోయాడట.ఈ వార్త చూసి చాలామంది నిజమే అనుకోని దీని గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం నాగ శౌర్య ఎన్టీఆర్ క్లాసిక్ టైటిల్ ‘@నర్తనశాల’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర టైటిల్ ను నిర్మాత – దర్శకుల నుండి ఏమాత్రం అనుమతి తీసుకోకుండా వాడుకుంటున్నందుకు బాలయ్యకు కోపం వచ్చి ఫైర్ అయ్యాడట.

ఫస్ట్ టైం కాబట్టి క్షమిస్తున్నానని – మరో సారి ఇలాంటి తప్పు చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చాడని కొంతమంది ప్రచారం చేయడం మొదలు పెట్టారు. కానీ ఈ వార్త లో ఏ మాత్రం నిజం లేదట..ఎవరో కావాలని తమ పబ్లిసిటీ కోసం ఇలా ప్రచారం చేస్తున్నారని శౌర్య తన సన్నిహితుల దగ్గర చెపుకున్నాడట.మరి ఇచ్చాడో లేదో తెలియాలంటే వీరిద్దరిలోనే ఎవరో ఒకరు స్పందించాలి.