వైజాగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం స్టూడియో నిర్మిస్తున్న బాలయ్య

373

బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాలయ్య గురించి మరో క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది.రాష్టం విడిపోయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లోనే ఉన్న సంగతి మన అందరికి తెలిసినదే.చాలా స్టూడియోలు హైదరాబాద్ లోనే ఉన్నాయి.

Image result for balayya

అందుకే సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీనికి సంబంధించి ఒక చర్చ మొదలయింది.ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం స్టూడియో నిర్మించడానికి ముందుకు వస్తే వైజాగ్ లో వందలాది ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో బాలయ్య ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Image result for balayya

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం స్టూడియో నిర్మించాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.సినిమా నిర్మాణంలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కార్యక్రమాలకు అనువుగా మెరుగైన వసతులతో స్టూడియో నిర్మాణానికి బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ న్యూస్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.