బాల‌య్య నువ్వు ఆకాశం నుంచి రాలేదు నీ బ్ల‌డ్ బ్రీడ్ ఏమిటి నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

317

బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది నాగబాబు తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ వివరణ ఇస్తూ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. ఆ వ్యక్తి(బాలకృష్ణ) ఇప్పటికి ఆరు సార్లు మా ఫ్యామిలీ మీద, మా అన్నదమ్ముల మీద కామెంట్ చేశారని చెప్పిన నాగబాబు… నేను ఒకసారి తెలియదు అంటే ఎందుకు ఫీవుతున్నారని ప్రశ్నించారు. కామెంట్ నెం.1 పేరుతో ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేసిన ఆయన… తాజాగా బాలయ్య కామెంట్ నెం.2 పేరుతో మరో వీడియో వదిలారు.

Image result for balayya

బాలయ్య కామెంట్ నెం.2: ఒకరిని హీరోను చేయడం ఇష్టం లేదు.. మేమే సూపర్ స్టార్స్ కామెంట్ నెం.2 బాలయ్య ఏబీఎన్ ఛానల్‌ ఇంటర్వ్యూలో చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ మీద ఆయన అభిప్రాయం అడిగారు. అది తప్పయితే తప్పు అని చెప్పండి. కానీ అలా కాకుండా ‘అవన్నీ మాకు అవసరం లేదు. మాకు మేమే హీరోలం. మాకు మేమే సూపర్ స్టార్లం.’ అన్నారువెరీ గుడ్ సర్.. మీకు మీరే సూపర్ స్టార్లు. మాకు అభ్యంతరం లేదు. కానీ మిగతా వాళ్లు కాదా? మీరేనా సూపర్ స్టార్స్? మీరేనా గొప్ప నటులు. పవన్ కళ్యాణ్ కాదా? ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఏమిటి? దీనికి కామెంట్ చేయడం మాకు కుదరదా? మాకు చేతకాదా? మేము కౌంటర్ చేయలేమా? అయినా ఎందుకులే.. చూద్దాం అని చాలా ఓపికగా వెయిట్ చేశామని… నాగబాబు చెప్పుకొచ్చారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక్కడ సూపర్ స్టార్లు ఒక్కరే కాదు.. చాలా మంది ఉంటారు. ప్రతి వారూ స్టార్సే. మీకు సంబంధించిన కొంత మంది వ్యక్తులు మాత్రమే హీరోలు కాదు. మహేష్ బాబు అనబడే స్టార్ ఉన్నాడు. జూ ఎన్టీఆర్ అనే ఒక స్టార్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అనే స్టార్ ఉన్నాడు. మెగా స్టార్ ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణగారు ఉన్నారు. చాలా మంది స్టార్స్ ఉన్నారని నాగబాబు చెప్పుకొచ్చారు.మీకు మీరు స్టార్ అని చెప్పుకోండి పర్లేదు. ఎవరినో హీరోను చేయడం ఎందుకు? అని అనడం సరికాదు. మీరు ఎవరినీ చేయక్కర్లేదు. జనాలు హీరోను చేస్తారు. జనాలకు నచ్చితే హీరోలవుతారు. జనాలు మెచ్చుకుంటే స్టార్లవుతారు. దీనికి కూడా మేము కామెంట్ చేయొచ్చు. అయినా కూడా మేము కామ్ గానే ఉన్నామని నాగబాబు తెలిపారు. మ‌రి నాగబాబు కామెంట్ల పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో మీ అభిప్రాయం తెలియ‌చేయండి.