బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఏమైందో తెలిస్తే షాక్

913

నంద‌మూరి న‌ట‌సింహం హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఏం చేసినా సంచ‌ల‌న‌మే.. ఆయ‌న హిందూపురం ఎమ్మెల్యే అయిన త‌ర్వాత సినిమాల‌కు రాజ‌కీయాల‌కు స‌మానంగా స‌మ‌యం కేటాయిస్తున్నారు ఇటు సినిమాలు చేస్తూనే అటు రాజ‌కీయాల్లో బీజీగా ఉన్నారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కూడా బాల‌య్య బాబు న‌టిస్తున్నారు, ఇక ప్ర‌ధాన భూమిక‌గా ఆయ‌న ఎన్టీఆర్ పాత్ర‌ని బ‌యోపిక్ లో చేస్తున్నారు అయితే సినిమాల్లో బిజీగా ఉన్నా ఇటు ఆయ‌న హిందూపురంలో త‌మ బాధ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు అని గ‌తంలో అక్క‌డ ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేశారు ధ‌ర్నాలు ర్యాలీలు చేశారు త‌ర్వాత రెండు మూడు రోజులు ప‌ర్య‌ట‌న‌లు చేసి బాల‌య్య ఇక్క‌డ ప్ర‌జల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు త‌న పీఎ వ్య‌వ‌హారం న‌చ్చ‌క వేరే వ్య‌క్తిన ఇక్క‌డ ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి తెలుసుకునేలా చేశారు అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం అవ్వ‌డంతో బాల‌య్య తెలంగాణ ప్ర‌చారంలో బీజీబిజీగా ఉన్నారు ఈ స‌మ‌యంలో హిందూపురంలో బాల‌య్య ఇంటి ద‌గ్గ‌ర ఓ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది మ‌రి ఆ ఘ‌ట‌న ఏమిటో తెలుసుకుందాం.

Image result for బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు పారిశుద్ధ్య కార్మికులు చెత్త కుమ్మరించారు.. జీవో నెంబరు 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా ఐదో రోజు ఎమ్మెల్యే ఇంటి ముందు చెత్త పోసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకుని, చెత్తను తీసేయించి.. కార్మికులను అక్కడి నుంచి పంపించేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

జీవో నెంబరు 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వంతో చర్చల అనంతరం 15 రోజుల తర్వాత సమ్మె విరమించారు. 279 జీవో రద్దుకు ప్రభుత్వం ఒప్పుకుందని కార్మికులకు యూనియన్ లీడర్లు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగిందని అనుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సూచనలూ రాలేదని, 279 జీవో ప్రకారమే పని చేయాలని మున్సిపల్ కమిషనర్లు స్పష్టం చేయడంతో ఐదు రోజుల క్రితం కార్మికులు మళ్లీ సమ్మెలో దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. జీవో నంబర్ 150 అమలు చేసి వేతనాలను అరియర్స్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై బాల‌య్య వారికి సర్దిచెప్పారు అని తెలుస్తోంది త‌న అనుచ‌రుల ద్వారా. ప్ర‌భుత్వంతో మాట్లాడి దీనిపై ఓ ప‌రిష్కారం చూపిస్తామ‌ని తెలియ‌చేశారట‌.