సైరా షూటింగ్ సెట్ లో బాలయ్య..

359

మెగాస్టార్ చిరంజేవి నటిస్తున్న సైరా చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇటీవల విడుదలైన టీజర్ కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.

చారిత్రాత్మక నేపథ్యం

సైరా చిత్రం గురించి అభిమానులతో పాటు టాలీవడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.సైరా చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది.ఈ చిత్ర సెట్స్ కు ఇటీవలే పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన సంగతి మన అందరికి తెలిసిందే.ఇప్పుడు మరొక ప్రముఖ అతిధి వచ్చాడు.ఆయనెవరో కాదు నందమూరి బాలకృష్ణ.సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాడట.బాలయ్య సర్ ప్రైజ్ విజిట్ కు సంబంధించిన ఫొటోలు బయటకు రాలేదు కానీ ఈ వార్త వైరల్ లా వ్యాపించింది.

Related image

బాలయ్య రాకతో సెట్ లో చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యంలో మునిపోయారట.మెగాస్టార్ చిరంజీవితో కలసి బాలయ్య చాలా సేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. సినిమా బాగా రావాలని బాలయ్య ఆకాంక్షించినట్లు తెలుస్తోంది. టాలీవడ్ లో అగ్ర నటులుగా ఉన్న వీరిద్దరూ మంచి మిత్రులు కూడా.ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి సైరా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 లో ఎన్టీఆర్ బయోపిక్, సైరా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.