బోయపాటి-బాలయ్య కథ లీక్

299

బోయపాటి శ్రీను బాలకృష హిట్ జోడి. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ లాంటి సినిమాలు సూపర్‌ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఇద్దరు హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు. ‘యన్‌.టి.ఆర్‌’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా బాలయ్య ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ లో ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభకానుందని తెలుస్తోంది.

Related image

అయితే ఈ చిత్రం గురించి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని అంటున్నారు.

Image result for boyapati balayya movie

ముఖ్యమంత్రిగా బాలయ్య నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయని.. ఆ తరహాలో బోయపాటి కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రం గురించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవలే బోయపాటి వినయవిధేయ లాంటి అట్టర్ ప్లాప్ సినిమా తీశాడు. అయినా కానీ బోయపాటి మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాడు బాలయ్య. చూడాలి మరి బాలయ్య నమ్మకాన్ని నెరవేరుస్తాడో లేదో.