క్రేజీ కాంబినేషన్… కొరటాల డైరెక్షన్ లో బాలయ్య బాబు..

347

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వనుంది. మహానాయకుడు ఫిబ్రవరిలో విడుదల అవుతుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం విడుదల కాగానే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక చిత్రం రాబోతోంది. ఈ చిత్రం తరువాత మరో క్రేజీ దర్శకుడికి బాలయ్య కమిట్మెంట్ ఇచ్చారు.

Image result for koratala shiva balakrishna

కొరటాల శివ బాలయ్యని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిందట. బాలయ్య హీరోగా కొరటాల శివ సామజిక సందేశంతో ఓ భారీ చిత్రానికి తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య తాత, తండ్రి, మనవడిగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం..మూడు పాత్రల్లో భిన్నంగా కనిపించేందుకు బరువుతగ్గితే బావుంటుందని కొరటాల చెప్పడంతో బాలయ్య వెంటనే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ చిత్రంలో దాదాపు 20 కేజీలు బరువు తగ్గాలని కొరటాల సూచించాడంట.

 మూడు పాత్రల్లో బాలయ్య

అయితే కొరటాల శివ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీస్తున్నాడు. ఆ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత. ఆ చిత్రం తర్వాతనే బాలయ్య కొరటాల శివ చిత్రం ప్రారంభం అవుతుంది.