బాలకృష్ణ పరువు తీస్తున్న కొడుకు మోక్షజ్ఞ..అసలు కారణం తెలిసి ఇండస్ట్రీ షాక్

514

సినీ రంగంలో పెద్ద ఫ్యామిలీకి చెందిన ఏ కుర్రాడైనా సరే.. అభిరుచి ఉన్నా లేకున్నా సినిమాల వైపు అడుగులేయాల్సిందే. గతంలో కొందరైనా వేరే రంగాల వైపు వెళ్లే వాళ్లు కానీ.. ఇప్పుడు ఎవ్వరూ పక్క దారులు చూడట్లేదు. కచ్చితంగా సినిమాల్లోకే వస్తున్నారు. జనాలు మెచ్చినా మెచ్చకున్నా సినిమాలు చేస్తూనే ఉన్నారు. స్టార్ హీరోల అల్లుళ్లు.. మేనల్లుళ్లు సైతం సినీ రంగ ప్రవేశం చేస్తున్నపుడు నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో కొడుకైన మోక్షజ్ఞ సినిమాల్లోకి రాకుండా ఎలా ఉంటాడు? అతడి తెరంగేట్రం చిన్నతనంలోనే ఖరారైపోయింది. కానీ ఆ మూమెంట్ ఎప్పుడని అందరూ ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ల నుంచి బాలయ్య కొడుకు అరంగేట్రం గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో అదిగో అంటూనే ఉన్నాడు. నందమూరి అభిమానులు చాలా ఉత్కంఠగా దీని గురించి చర్చించుకుంటున్నారు…

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేసి తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు. ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలతో గ్యాప్ లేకుండా ఉంటున్నాడు. చాలా రోజులుగా బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నాడు కానీ ఇప్పటివరకు అది జరగలేదు. ఒక దశలో 2017లో మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయం అన్నాడు బాలయ్య. కానీ ఇప్పుడు 2019 వచ్చేసింది. ఇంకా అతడి ఎంట్రీపై స్పష్టత రాలేదు. ఇటీవల ‘మహానాయకుడు’ ప్రమోషన్లలో మాట్లాడుతూ త్వరలోనే తన కొడుకు తొలి సినిమా మొదలయ్యే అవకాశమున్నట్లు చెప్పాడు బాలయ్య. తెరంగేట్రం కోసం మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా చెప్పాడు. కనీసం మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. మోక్షజ్ఞను సర్‌ ప్రైజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో బాలయ్య కొడుకును దాస్తున్నాడు అంటూ అంతా భావించారు.

తాజాగా లీక్‌ అయిన ఒక ఫొటోను చూస్తుంటే మోక్షజ్ఞ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. మోక్షజ్ఞ చాలా లావుగా ఉన్నాడు. గత రెండేళ్లుగా బరువు తగ్గేందుకు చాలా కష్టపడుతున్నాడు. మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు నటనలో శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన మోక్షజ్ఞ అక్కడ చాలా బరువు పెరిగాడు. ఆ బరువును తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఏవీ కూడా సఫలం కావడం లేదని నందమూరి సన్నిహితులు అంటున్నారు. మోక్షజ్ఞ మాములుగా వ్యక్తిగా ఉన్నాడే తప్ప.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఏమాత్రం అనిపించడం లేదు. తనలో ఎలాంటి మేకోవర్ కనిపించడం లేదు.

అయితే బరువు పెరగడం మరియు తగ్గడం అనేది పెద్ద సమస్య కాదు, శ్రద్ద పెడితే ఖచ్చితంగా మోక్షజ్ఞ బరువు తగ్గే వాడని, అసలు ఆయనకు సినిమాల్లోకి వచ్చే ఆసక్తి లేకపోవడం వల్ల బరువు తగ్గడం లేదు అంటూ కొందరు యాంటీ బాలయ్య ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. హీరో అయ్యే వయసు వచ్చి దాటి పోతున్నా కూడా ఇంకా మోక్షజ్ఞ ఎందుకు హీరోగా అయ్యేందుకు ఆసక్తి చూపడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ వయసు గల చాలా మంది వారసులు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేశారు. మరి ఈ విషయంలో బాలయ్య ఏం ఆలోచిస్తున్నారో! మోక్షఙ ఎంట్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..