500 ఎకరాల పొలం కొనుగోలు చేసిన బాలకృష్ణ ఎక్కడ ఎప్పుడు ఎలా

928

నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఏది చేసినా సంచలనమే అని చెప్పాలి.. గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఈ ఐదు సంవత్సరాలు బాలయ్య కూడా ఏది చెబితే అది జరిగింది.. పైగా హిందూపురంలో బాలయ్య కూడా తన పీఏల పై విమర్శలు రావడం. అక్కడ సమస్యలు గాలికి వదిలేశారు అని విమర్శలు రావడం ఇవన్నీ పెద్ద ఎత్తున బాలయ్యకు ఎన్నికల్లో ప్రతికూలం అయ్యాయి, కాని ఆయన మాత్రం ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.ఈ సమయంలో బాలయ్య గురించి ఓ వార్త పెను వైరల్ అవుతోంది.

ఈ క్రింద వీడియోని చూడండి

సినీ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, గత తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగానే అమరావతిలో వందలాది ఎకరాలను తన పేరిట కొనుగోలు చేశారట. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. రాష్ట్ర విభజన తర్వాత, రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే ఈ లావాదేవీలన్నీ జరిగినట్టు ఆ పత్రికా కథనం పేర్కొంది. అంటే అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు ఆ పత్రికా కథనం పేర్కొంది.

Image result for balakrishna

అమరావతి ప్రాంతాన్ని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించక ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, మంత్రులు నారాయణ, నటుడు మురళీ మోహన్ హెరిటేజ్ సంస్థ వందల ఎకరాలను కొనుగోలు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ‘గుంటూరు – విజయవాడల మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించక ముందే బాలకృష్ణ, తన బంధువుతో కలిసి 500 ఎకరాలను కొనుగోలు చేశారు. తెలుగుదేశం నేతలు ఎంతో మంది ఈ ప్రాంతంలో భూములను ముందే కొన్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి’ అని వైకాపా నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్లపత్రిక ఈ సంచలన కథనాన్ని ప్రచురించడం గమనార్హం.

Image result for balakrishna

ఇదిలావుంటే, ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ను బయటకు తెస్తామని ప్రకటించారు. అమరావతిలో భూసమీకరణ ఓ అతిపెద్ద స్కామ్ అని, తెలుగుదేశం నేతలు రహస్య ప్రమాణాన్ని మీరారని ఆయన ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సైతం ఈ విషయాలను గమనించిన తర్వాతనే రాజధాని నిర్మాణానికి నిధులను ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందని బొత్స గుర్తుచేశారు. బాలయ్యపై ఇప్పుడు ఈ కథనం రావడంతో పెద్ద చర్చ అయితే జరుగుతోంది మరి ఇది ఎంత వరకూ వాస్తవమో చూడాలి.