NTR బయోపిక్ లో మామా,అల్లుళ్ళ లుక్ అదుర్స్..

75

తెలుగు వాళ్లందరికీ ఇలవేల్పు అయినా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను చేస్తున్నాడు.విద్యాబాలన్ కైకాల సత్యనారాయణ,రానా,సుమంత్ లాంటి నటులు ఇందులో నటిస్తున్నారు.‘యన్‌టీఆర్’ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది.‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌లో రానా..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Image result for ntr biopic

వినాయకచవితి సందర్భంగా ఈ మూవీలోని NTR, చంద్రబాబు క్యారెక్టర్లకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్టీఆర్‌ గా బాలకృష్ణ, ఆయన అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబుగా రానా దగ్గుబాటి ఫస్ట్‌ లుక్స్‌ మాత్రమే బయటకి వచ్చాయి. ఈసారి మామా అల్లుళ్లు కలిసే వచ్చారు.

పోస్టర్‌ లో NTR.. తన అల్లుడిపై ప్రేమగా చెయ్యివేసి మాట్లాడుతున్నట్లుగా చూపించారు.ఇదివరకు రిలీజైన లుక్స్‌ కంటే ఈ పోస్టర్‌ ఫ్యాన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.