అభిమానిని కాలితో త‌న్నిన బాల‌య్య వెంట‌నే ఆ అభిమాని చేసిన ప‌నికి షాక్

414

సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన చేతికి పనిచెప్పారు. ఎవ‌రైనా అభిమానులు త‌న ద‌గ్గ‌ర అతి ప్ర‌వ‌ర్తిస్తే వెంట‌నే వారిపై బాల‌య్య త‌న చేతికి ప‌నిచెపుతారు..తాజాగా ఇదే చేశారు మ‌రోసారి బాల‌య్య‌, త‌న దగ్గరకు వచ్చిన అభిమానిపై తన ప్రతాపం చూపారు. కాలుతో తన్ని ఫ్యాన్స్ కు ఆగ్రహం రప్పించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న బాలయ్య తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద ఓ కార్యకర్తపై అసహనానికి గురయ్యారు. దీంతో కారు దిగి మరీ కాలుతో తన్నాడు బాలయ్య. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో అభిమానంతో చూసేందుకు వచ్చిన అభిమానులను తన్నుతారా అంటూ బాలకృష్ణ ఫ్లెక్సీలను తగులబెట్టారు.

Image result for balakrishna with fans

ఈ మధ్య బాలయ్య చెంపదెబ్బల స్పెషలిస్ట్ గా మారిపోయారు. రీల్ లైఫ్ లో అభిమానులే తన దేవుళ్లు అంటూ స్పీచ్ లు ఇచ్చే బాలయ్య అభిమానంతో దగ్గరకు వస్తున్న వారిని అక్కున చేర్చుకోవాల్సిందిపోయి చెంప చెళ్లు మనిపించడం లేదా కాలుతో తన్నడం చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. అవేశాన్ని తట్టుకోలేకో లేక తన అభిమానులే కదా అనో తెలియదు కానీ ఎక్కడపడితే అక్కడ బాలయ్య అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా..సెల్ఫీ దిగేందుకు వచ్చినా బాలయ్యది ఒకటే రియాక్షన్ అదే చెంప చెళ్లుమనిపించడం. ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు అన్నీ ఇన్నీ కావు.

Image result for balakrishna with fans

గతంలో తన శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్ ను కొట్టి వార్తల్లోకెక్కారు బాలయ్య. అలాగే నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తపై చెయ్యిచేసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత తన సొంతనియోజకవర్గమైన హిందూపురంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్త చెంపచెళ్లు మనిపించారు.అభిమానుల గూబ గుయ్యమనేలా వీరకొట్టుడు కొడుతున్న బాలయ్య అదే రీతిలో తాను కొట్టిన చెంపదెబ్బలను సమర్ధించుకుంటున్నారు కూడా. గతంలో ఓ అభిమానిని కొట్టిన సందర్భంలో సోషల్ మీడియా బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పందించిన బాలయ్య ఎవరెన్ని రాసినా డోంట్ కేర్.. నా అభిమానులని అడగండి.. వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా, నన్ను కొట్టాడురా అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా చేయి తగిలితే వాడికొక అనందం అంటూ సమర్థించుకున్నారు కూడా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రాసేవాళ్ళకేమీ తెలుసు వాళ్ల బొంద అంటూ సెటైర్ కూడా వేశారు.అంత‌టితో ఆగిపోలేదు…అనవసరంగా నేను కొట్టను, అవతలోడు రెచ్చగొట్టినా, తప్పు చేసినప్పుడు మాత్రమే అలా జరుగుతుందని అన్నాడు. ఇదంతా నాకు అభిమానులకి మధ్య ఎప్పుడూ ఉండేదేనన్నారు. మధ్యలో ఎవరొచ్చినా వాడికి ట్రీట్ మెంట్ వేరుగా ఉంటుందని ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు బాలయ్య.. రీల్ లైఫ్‌లో పంచ్ డైలాగులు, ఫైట్స్‌తో అభిమానులను అలరించే బాలకృష్ణ, రియ‌ల్ లైఫ్‌లో అభిమానులపై సంయమనం కోల్పోయి చెంపదెబ్బలు కొడితే ఆగ్రహానికి గురికావాల్సిందేనని గుసగుసలు వినపడుతున్నాయి.హిందూపురం, నంద్యాలలో బాలకృష్ణ చెంపదెబ్బలకు బలైన వాళ్లు నిశబ్ధంగా ఉన్న ఖమ్మం జిల్లా తల్లాడలో మాత్రం ఊరుకోలేదు. అభిమానంతో దగ్గరకొస్తే కాలుతో తన్నుతారా అంటూ పోస్టర్లను తగులబెట్టి తమ ఆగ్రహాన్ని చూపించారు. మ‌రి ఇలా చేసిన అభిమానుల‌పై బాల‌య్య ఎలా స్పందిస్తారో చూడాలి. మ‌రి బాల‌య్య యాక్ష‌న్ పై అభిమానుల రియాక్ష‌న్ పై మీ కామెంట్ల‌ను అభిప్రాయాలుగా తెలియ‌చేయండి.