బాబు మోహన్ బిచ్చమెత్తుకుంటున్నాడు..ఎందుకో చూడండి…

433

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ పేరులో బాబు మోహన్ కూడా ఒకరు. సినిమా పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా సూపర్ క్రేజ్, పాపులారిటీ తెచ్చుకున్న బాబు మోహన్ ఆ తర్వాత రాజకీయాలలోకి వెళ్ళారు. ప్రస్తుతం టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

రాజకీయాలలోకి వెళ్ళిన కూడా సినిమాల మీద ఇంకా ప్రేమ తగ్గనట్టు ఉంది.అందుకే కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన బాబు మోహన్ మళ్లీ సిని కెరియర్ కొనసాగించాలని చూస్తున్నాడు.అందుకే ఒక సినిమా చెయ్యడానికి పచ్చ జెండా ఊపాడు.తన కెరియర్ లో బాగా పేరు తెచ్చిన ముష్టోడి పాత్రని మళ్లీ వేస్తున్నారు బాబు మోహన్. బిచ్చగాడా మజాకా సినిమాలో బాబు మోహన్ బిచ్చగాడి పాత్రలో కనిపిస్తున్నారు.

ఆయన మీద ఓ పాట కూడా షూట్ చేయడం జరిగింది. ఇంత బువ్వుంటెయ్యమ్మో.. ఇంత కూరుంటెయ్యమ్మో.. అని అప్పట్లో ముష్టి పాటతో ప్రేక్షకుల మనసు దోచుకున్న బాబు మోహన్ ఇప్పుడు బిచ్చగాడా మజాకా సినిమాలో కూడా అదే పాత్రతో వస్తున్నాడు. మరి బాబు మోహన్ అప్పటిలాగా మెప్పిస్తాడో లేదో చూడాలి.