చంద్ర‌గ్ర‌హ‌ణం స‌మ‌యంలో అర్ధ‌రాత్రి బాబుగోగినేని హౌస్ లో ర‌చ్చ ర‌చ్చ షాకైన గీతామాధురి

561

చంద్ర‌గ్ర‌హ‌ణం సూర్యగ్ర‌హ‌ణం ఎప్పుడు ప‌ట్టినా వెంటనే మీడియాలో చ‌ర్చాగోష్టిల‌కు పిలుస్తారు ప్ర‌ముఖహేతువాది బాబుగోగినేనిని.. అయితే ఈ సారి మాత్రం ఆయ‌న బిగ్ బాస్ హౌస్ లో ఉండ‌టంతో చాలా ఛాన‌ల్స్ కు టీర్పీలు వ‌న్ డే ప‌డిపోయాయి అని చెప్ప‌వ‌చ్చు… సైన్స్ ని న‌మ్మాలి మూడ‌న‌మ్మ‌కాల‌ను ప‌క్క‌న పెట్టాలి అని చెప్పే బాబుగోగినేని, మ‌రి గ్ర‌హ‌ణం రోజు కూడా అక్క‌డ కంటెస్టెంట్స్ కు అనేక విష‌యాలు తెలియ‌చేశారట‌.. ఇక బిగ్ బాస్ హౌస్ లో గ్ర‌హ‌ణం స‌మ‌యంలో ఆహారం తిన‌కూడ‌దు ఆ స‌మ‌యంలో నీరు తాగ‌కూడ‌దు అనేలా కామెంట్లు వ‌స్తే వాటిని కూడా ఆయ‌న ట్రాష్ నాన్సెన్స్ అని కొట్టాపారేశార‌ట‌. గ్ర‌హ‌ణ స‌మ‌యంలో అన్నీ ప‌నులు చేసుకోవ‌చ్చు కొంద‌రు మూడ న‌మ్మ‌కాలుగా ఇవి సృష్టించారు, ఇలాంటి ఖ‌గోల వింత‌లు చూడ‌టం మ‌నం మిస్ కాకూడ‌దు అని చెప్పార‌ట‌.

Image result for babu gogineni in bigg boss

ఇక గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఆయన ఏమిచెబుతారు అని కంటెస్టెంట్స్ ఎదురుచూశారు.. ముఖ్యంగా చంద్ర‌ గ్ర‌హ‌ణం కాబ‌ట్టి బాబుగోగినేని ఈ చంద్ర‌గ్ర‌హ‌ణం విష‌యం అక్క‌డ బిగ్ బాస్ హౌస్ లో ఎలా వివ‌రించారు అని ప్రేక్ష‌కులు కూడా ఎదురుచూశారు.. ఇటు కంటెస్టెంట్ తో గొడ‌వ‌లు ప‌డినా బాబు మాత్రం గ్ర‌హ‌ణం గురించి తెలియ‌చేశార‌ట‌. రెడ్ మూన్ చూడ‌టానికి అంద‌రిని బ‌య‌ట‌కు పిలిచారు అని తెలుస్తోంది. ఇక బాబు క్లాస్ తీసుకుంటే ఏవిధంగా ఉంటుందో తెలిసిందే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడ‌తారు ఇక కంటెస్టెంట్స్ కూడా బాబు ఖ‌గోళం గురించి చెబుతుంటే విన్నారంట‌.

అలాగే గ్ర‌హ‌ణం రోజు ఇవి తిన‌కూడ‌దు అవి తిన‌కూడ‌దు అని చెప్ప‌డం త‌ప్పు అని, ఆయ‌న గ్ర‌హ‌ణం ప‌ట్టుప‌ట్టిన స‌మ‌యంలో ఆహారం తీసుకున్నార‌ట‌. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎటువంటి ఖ‌గోలవింత‌ల గురించి బాబు చెప్పారు అనేదానిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆయ‌న గ్ర‌హ‌ణం రోజు ఏం చేశారు అనేది నేడు చూడ‌బోతున్నాం. మ‌రి ఇటు గీతామాధురికి కాస్త ప‌ట్టింపులు ఎక్కువ…ఆమె గ్ర‌హ‌ణం స‌మ‌యంలో ప‌ద్ద‌తులు పాటించింది అని తెలుస్తోంది.. అలాగే దీప్తి న‌ల్ల‌మోతు కొందు ఇంటి స‌భ్యులుకూడా గ్ర‌హ‌ణం కంటే ముందే భోజ‌నం చేశార‌ట.. మొత్తానికి ఈ గ్ర‌హ‌ణం ఎపిసోడ్ లో బాబు గోగినేని ఎటువంటి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.. స‌భ్యుల్ని ఎలా ఎడ్యుకేట్ చేశారు అనేది ఈ రోజు స్ప‌ష్టంగా తెలియ‌నుంది.. చూడాలి బాబుగారి పాఠాలు స‌భ్యులు ఎలా విన్నారో.