బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన కమల్ హసన్ ను ఘోరంగా అవమానించిన బాబు గోగినేని..ఏం చేశాడో తెలిస్తే షాక్

1314

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతం గా 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ 50 రోజులు హౌస్ సభ్యులు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. శని, ఆదివారాల్లో నాని సైతం హౌస్ సభ్యులు చేసే తప్పులను బయటపెడుతూ, వారికీ క్లాస్ లు పీకుతూ, చూసే ప్రేక్షకులకు సైతం కొత్త ఉత్సహం నింపుతూ వస్తున్నాడు.అయితే ఈరోజు కు సంబంధించి ఒక ప్రోమోను విడుదల చేశారు.ఆ ప్రోమోలో లోకనాయకుడు కమల్ హసన్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు.అయితే బాబు గోగినేని చేసిన ఒక పని కమల్ హసన్ ను అవమానించేలా ఉంది.మరి బాబు గోగినేని ఏం చేశాడో తెలుసుకుందామా.

Image result for kamal hasan at telugu bigboss house

బిగ్ బాస్ అంటేనే ఫుల్ ఆఫ్ సర్ ప్రైజెస్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. గడిచిన సీజన్ ను గ్రాండ్ హిట్ చేసిన ఎన్టీఆర్ స్థానంలో ఈ సంవత్సరం నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇరగదీస్తున్నాడు. కానీ ఇప్పుడు కొత్తగా కమల్ హాసన్ బిగ్ బాస్ హౌస్ కు వచ్చాడు. ఏంటా కథ.. అనేది ఆసక్తిగా మారింది.తమిళ బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్ తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ మాత్రం హోస్ట్ గా కాదు అతిథిగానే. కమల్ హాసన్ హైదరాబాద్ బిగ్ బాస్ హౌస్ వద్దకు రాగానే స్టార్ మా సీఈవో తోపాటు హోస్ట్ నాని ఆయనకు సాదర స్వాగతం పలికారు.కమల్ హాసన్ సొంత నిర్మాణ సారథ్యంలో ‘విశ్వరూపం2’ మూవీని తెరకెక్కించాడు. దీనికి ఆయనే దర్శకుడు.

Image result for kamal hasan with nani

తాజాగా ఈ సినిమాను తెలుగులోనూ ఆయన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అయితే ఇంటికి వచ్చిన కమల్ హసన్ ను చూసి ఇంటి సభ్యులు అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.తమ ఆనందాన్ని ఎలా తెలుపుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు.కమల్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు.

అయితే ఇక్కడ బాబు గోగినేని చేసిన ఒక పని అందరిని ఆశ్చర్యపరచింది.ఇంట్లోకి అడుగు పెట్టగానే కమల్ హసన్ అందరికి నమస్కారం తెలియజేస్తూ చేతులతో నమస్కారం పెట్టాడు.ఇంటి సభ్యులు ఎంతో ఆనందంలో ఆయనకు నమస్కారం పెడితే బాబు గోగినేని కమల్ హసన్ ఎవరో తెలియనట్టు బిహేవ్ చేశాడు.కనీసం నమస్కారం కూడా పెట్టలేదు.అలాగే ఇంటికి వచ్చిన అతిధిని ఇల్లు చూపించడం,కొంచెం ప్రేమగా మాట్లాడడం లాంటివి చెయ్యాలి.కానీ ఎవరో తెలియని వ్యక్తి వచ్చినట్టు బాబు గోగినేని ప్రవర్తించాడు.ఈయన ప్రవర్తన మీద ఇంట్లో కానీ బయట కానీ రోజురోజుకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.మరి కమల్ ను బాబు గోగినేని ఎలా ట్రీట్ చేశాడో పూర్తీగా తెలియాలంటే ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ వరకు ఎదురుచుడాల్సిందే.మరి ఈ విషయం మీద మీరేమంటారు.బిగ్ బాస్ హౌస్ లోకి లోకనాయకుడి ఎంట్రీ గురించి అలాగే బాబు గోగినేని ప్రవర్తన మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.