ప్రభాస్ ని ఫోటో అడిగి చెంప చెల్లుమనిపించిన అమ్మాయిని ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తేషాక్

378

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అమ్మాయిల మతి పోగొట్టే పేరు అని చెప్పడంలో సందేహం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. బాహుబలిగా ప్రభాస్ నటనకు అంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ప్రభాస్ కు అభిమానుల నుంచి చిక్కులు తప్పడం లేదు. ప్రభాస్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ మీద పడిపోతున్నారు. ఇటీవల ప్రభాస్ కు ఎయిర్ పోర్ట్ లో సరదా సంఘటన ఎదురైంది. అయితే ఇది స‌ర‌దాగా జ‌రిగినా ప్ర‌భాస్ అభిమానులు మాత్రం ఇలా చేసిన వారిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ప్రభాస్ ఈ వీడియోలో ఓ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తున్నాడు.

అది విదేశాల్లోని విమానాశ్రయంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఓ ఇండియన్ యువతి ప్రభాస్ ని చూడగానే సంతోషం పట్టలేకపోయింది. వెంటనే ఫోటో కోసం ప్రభాస్ ని రిక్వస్ట్ చేసింది. ప్రభాస్ తన అభిమానిపై ప్రేమతో ఫొటోకు అంగీకరించాడు. ఫొటోకు ఫోజు ఇస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయి సైలెంట్ గా ఉండలేదు. నవ్వుతూనే ఉంది. ఆ అభిమాని సంతోషాన్ని చూసి ప్రభాస్ కూడా మురిసిపోయాడు.ఫోటో పూర్తయ్యాక ప్రభాస్ పక్కన నిలబడి సంతోషంతో గంతులేసింది. ఆ అమ్మాయి సంబరం అక్కడితో ఆగిపోలేదు.. వెళుతూ వెళుతూ ప్రభాస్ చెంప‌పై సాఫ్ట్ గా కొట్టేసి వెళ్ళింది. దీనితో ప్రభాస్ మరోమారు నవ్వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఉన్నది ఒక ఇండియన్ యువతే కాబట్టి సరిపోయింది.. లేకుంటే ప్రభాస్ తన లేడి ఫ్యాన్స్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. బాహుబలిలో మహరాజులా కనిపించిన ప్రభాస్.

prabhas

సాహో చిత్రంలో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడు. శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా నటిస్తోంది. ఇటీవల షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రెండవ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కళ్ళు చెదిరేలా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయనే విషయం ఈ వీడియో ద్వారా అర్థం అవుతోంది.. సాహో చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్ర‌భాస్ తో ఫోటో దిగండి ఇలా స‌ర‌దాగా కూడా చేయ‌కండి అని డై హార్ట్ ఫ్యాన్స్ చెబుతున్నారు, మ‌రి ఆ అమ్మాయి చేసిన తుంట‌రిప‌నిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.