ఆటో రామ్ ప్రసాద్ జబర్దస్త్ కి రాకా ముందు ఏమి చేసేవాడో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

380

రామ్ ప్రసాద్ పరిచయం అక్కర్లేని పేరు. యూత్ లో మంచి క్రేజ్ ఉంది ఈయనకు. ఆటో పంచ్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. సుడిగాలి సుదీర్ టీమ్ లో రైటర్ గా చేస్తూ తన ఆటో పంచులతో అందరిని నవ్విస్తుంటాడు. సుదీర్ శ్రీను రామ్ ప్రసాద్ లకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైజాగ్ కు చెందిన రామ్ ప్రసాద్ హైదరాబాద్ ఎలా వచ్చాడు. ఎలా సక్సెస్ అయ్యాడు. రామ్ ప్రసాద్ వైజాగ్ టూ హైదరాబాద్ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Related image

రామ్ ప్రసాద్ విశాఖపట్నంలో 1986 మే 3 వ తేదీన జన్మించాడు. తండ్రి ఆదినారాయణ,తల్లి ఆది లక్ష్మి. తండ్రి చిన్న చిన్న పనులు చేసేవాడు. ఇప్పుడు క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు. తల్లి గృహిణి. రామ్ ప్రసాద్ కు ఒక అక్క ఉంది. ఆమె పేరు వాసుకి దేవి. దేవుడు అందరికి ఒకటే మెదడు ఇచ్చిన అందరు అన్నిట్లో సక్సెస్ అవ్వరు. రామ్ ప్రసాద్ కు చదువు అబ్బలేదు. అందుకే కేవలం ఇంటర్ వరకే చదువుకున్నాడు రామ్ ప్రసాద్. ఇక ఇంటర్ లో ఉన్నప్పడే బంక్ కొట్టి ఎక్కువగా సినిమాలు చూసేవాడంట. స్కూల్ లో ఉన్నప్పుడే ఉదయం స్కూల్ కు వెళ్లిరావడం సాయంత్రం మెడికల్ షాప్ లో పని చెయ్యడం ఆ తర్వాత ఇంటర్ ఫెయిల్ అయినా తర్వాత ఒక మెడికల్ రెప్రెసెంటివ్ గా పని చేశాడు. అంటే అన్ని హాస్పిటల్స్ కు వెళ్లడం వీరి ప్రోడక్ట్ గురించి చెప్పడమే పని. ఉదయం బైక్ మీద వెళ్తే అన్ని హాస్పిటల్స్ వెళ్లడం రాత్రికి ఎప్పుడో రావడం. అలా చేస్తున్నప్పుడే హైదరాబాద్ వెళ్లి మల్టి మీడియా చేద్దామని హైదరాబాద్ వెళ్ళాడు. మొదటి ఎడిటింగ్ నేర్చుకుందామనుకున్నాడు. అప్పుడే రూమ్ మేట్ ప్రసన్న పరిచయం అయ్యాడు. ప్రసన్న ఎక్కువగా రాస్తుండేవాడు. అతను రైటర్ గా ట్రై చేస్తుండేవాడు. అలా రామ్ ప్రసాద్ కూడా తన ఆలోచనలను రాసేవాడు. అలా ఇద్దరు మంచి స్నేహితులు అయ్యేవారు. ఇక్కడ ఆర్థిక ఇబ్బంది రావడంతో మళ్ళి విశాఖపట్నం వెళ్లి మల్లి జాబ్ చేసుకున్నాడు. ప్రసన్న ఇక్కడే ఉండి రైటర్ గా ట్రై చేసేవాడు. రామ్ ప్రసాద్ ప్రసన్నకు అవసరమయ్యే స్క్రిప్ట్స్ వైజాగ్ నుంచే రాసి పంపేవాడంట.

Image result for auto ram prasad

2013 లో ప్రసన్న మొదట జబర్దస్త్ లో చేరి స్క్రిప్ట్స్ రాసేవాడంట. అలా రామ్ ప్రసాద్ ను ఒక కామెడీ షో మొదలయ్యింది వచ్చి స్క్రిప్ర్ రైటర్ గా చేరమని చెప్పాడంట. కానీ అప్పటికే రామ్ ప్రసాద్ కు పెళ్లి జరగడం ఇప్పుడు జాబ్ మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని సంశయిస్తూ ప్రసన్న చెప్పాడు కాబట్టి ట్రై చేద్దామని వచ్చి మొదటి ధన్ రాజ్ కు స్క్రిప్ట్స్ రాసేవాడంట. అలా ఎంట్రీ అయ్యాడు రామ్ ప్రసాద్. తర్వాత కొన్ని రోజులకు ధన్ రాజ్ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఖాళీగా ఉన్నాడు రామ్ ప్రసాద్. అయితే అప్పటికే సుదీర్ టీమ్ లీడర్ అయ్యాడు. అప్పుడు రామ్ ప్రసాద్ బాగా రాస్తాడని శ్రీను చెప్పాడంట. అలా సుదీర్ టీమ్ లోకి వచ్చాడు. సుదీర్ టీమ్ సక్సెస్ అవ్వడానికి రామ్ ప్రసాద్ స్క్రిప్ట్స్ ఎంతో దోహదపడ్డాయి. యూత్ కు బాగా నచ్చేలా రాసేవాడు.ఆటో పంచులు ఎక్కువగా వేసేవాడు. ఎన్నో మంచి మంచి స్క్రిప్ట్స్ రాశాడు. స్టార్ట్ అయినప్పటినుంచి ఒక్క జబర్దస్త్ స్కిట్ కూడా మిస్ అవ్వలేదంట.ఇక రామ్ ప్రసాద్ పెళ్లి విషయానికి వస్తే అరుణను 2010 లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లది స్కూల్ లవ్ స్టోరీ. స్కూల్ లో ఉన్నప్పటినుంచే వీళ్ళు మంచి స్నేహితులు. రామ్ ప్రసాద్ కుటుంబం ఉన్నతస్థితిలో లేదు. అరుణ కుటుంబం మాత్రం ఆర్థికంగా కొంచెం ఉన్న కుటుంబం. రామ్ ప్రసాద్ కు అవసరం ఉన్నప్పుడు అరుణ ఎన్నోసార్లు డబ్బులు సర్దేదంట.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.సొంత ఇల్లు లేని అసలు సరైన సంపాదన లేని వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకుంది అరుణ. ఒక వ్యక్తి సక్సెస్ లో ఉంటేనే చూసే ఈరోజుల్లో అసలు ఏమి లేని రామ్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్న అరుణ నిజంగా గ్రేట్. ఇప్పుడు వీళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఎప్పటికైనా సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని రామ్ ప్రసాద్ కు కోరిక. చిరంజీవి అంటే ఎంతో ఇష్టం ఉండే రామ్ ప్రసాద్ ఆయనతో కలిసి ఖైదీ నెంబర్ 150 లో కలిసి నటించాడు. ప్రసన్న సినిమాలు చేస్తుండడంతో రామ్ ప్రసాద్ కు వేషాలు ఇప్పించేవాడు. నేను లోకల్, నాన్న నేను బాయ్ ఫ్రెండ్, ఓం నమో వెంకటేశాయా లాంటి సినిమాలలో నటించాడు. ఇలా జబర్దస్త్ చేస్తూనే అప్పుడప్పుడు వచ్చిన సినిమాలు చేస్తున్నాడు రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ కెరీర్ ఇంకా మంచిగా ఉండి ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకుందాం. మరి రామ్ ప్రసాద్ గురించి ఆయన పంచులు గురించి ఆయన సక్సెస్ స్టోరీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.