కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పేరుతో మోసం.కేరళ వరద బాధితుల కోసం డబ్బు సేకరించిన వ్యక్తి..

302

టాలీవుడ్ కమెడియన్ శ్రీనివాస రెడ్డి ఇటీవల గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి చిత్రాలలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీనివాస్ రెడ్డి బిజీగా నటిస్తున్నాడు.కమెడియన్ శ్రీనివాస్ రెడీ పేరు మీద నకిలీ పేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన ఓ సహాయ దర్శకుడు అనేక మోసాలకు పాల్పడ్డాడు.

Image result for srinivas reddy

టాలీవుడ్ లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న రవి కిరణ్ అనే వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి పేరిట నకిలీపేస్ బుక్ ఖాతా తెరిచినట్లు తెలియడంతో శ్రీనివాస్ రెడ్డి ఇంటీవల పోలీస్ కంప్లైన్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో సైబర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.పోలీసులు ఈ నకిలీ ఖాతా తెరిచింది రవికిరణ్ అనే కో డైరెక్టర్ అని తెలుసుకున్నారు.. తాను శ్రీనివాస్ రెడ్డిని అని నమ్మించి పలువురిని మోసం చేసినట్టు ఆ వ్యక్తి చెప్పాడు.

Image result for srinivas reddy

తనతో చాటింగ్ చేసేవారికి తాను శ్రీనివాస్ రెడ్డినే అని నమ్మించి తాను కేరళ వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నా అని కొంత మంది దగ్గర రూ 5 వేల వరకు డబ్బుని తన అకౌంట్ లో జమ చేయించుకున్నట్లు పోలీసుల దగ్గర ఆ వ్యక్తి చెప్పాడు.కేవలం డబ్బు కోసమే ఈ మోసానికి పాల్పడ్డాడనని, అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీనివాస్ రెడ్డి పేరు వాడుకునట్లు అతను చెప్పాడు.దీనితో పోలీసులు రవికిరణ్ తో శ్రీనివాస్ రెడ్డికి క్షమాపణ చెప్పించారు.కేసు నమోదు చేసుకుని అతనిని అరెస్ట్ చేశారు.