సాహో సెట్లోని ఫోటో లీక్ చేసిన హీరో!

219

‘బాహుబలి’ అఖండ విజయంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కోసం యావత్ భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ వీడియో అందరిని ఆకట్టుకుంది. ‘షేడ్స్ ఆఫ్ సాహో’ చాప్టర్ 1 పేరుతో విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో అభిమానులను అబ్బురపరచింది..హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి యాక్షన్ సీన్స్.ప్రభాస్ శ్రద్ధాకపూర్ యాక్షన్ సీన్స్ అందరిని అలరించాయి.

Image result for arun vijay saaho

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌. ఎవలిన్‌ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు.

అరుణ్ విజయ్ షేర్ చేసిన ఫొటో ఇదే

ఇలాంటి నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అరుణ్ విజయ్ సినిమా షూటింగ్‌లో తీసుకొన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ ఫోటో వైరల్ అయింది.సెట్స్‌లో నీకంటే కూల్ పర్సన్ ఎవరుంటారు? ఇంత వరకు నేను చూడలేదు జాకీ ష్రాఫ్ సార్ అంటూ అరుణ్ విజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.