” కబీర్ సింగ్” గా రాబోతున్న హిందీ అర్జున్ రెడ్డి

279

విజయ్‌ దేవరకొం‍డ హీరో సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్‌ హిట్ సినిమా అర్జున్‌ రెడ్డి. ఈ ఒక్క సక్సెస్‌తో విజయ్‌ స్టార్‌ హీరోగా మారిపోయాడు. అంతేకాదు దర్శకుడు సందీప్‌ రెడ్డికి కూడా అర్జున్‌ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది.

Related image

తెలుగు సినిమా కూడా అర్జున్ రెడ్డికి ముందు అర్జున్ రెడ్డి తర్వాత అనే చెప్పుకునే స్థాయికి వచ్చింది. అర్జున్‌ రెడ్డి ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాలో తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు.వర్మ పేరుతో తెరకెక్కుతున్న తమిళ వర్షన్‌ టీజర్‌ ఇటీవలే రిలీజ్‌ అయ్యింది.

Related image

హిందీ వర్షన్‌ షూటింగ్‌ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఒరిజినల్ వర్షన్‌ దర్శకుడు సందీప్‌ దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కబీర్‌ సింగ్‌ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు.మరి ఇది బాలీవుడ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.