హరికృష్ణ ఆ రెండు కోరిక‌లు తీర‌కుండానే చ‌నిపోయారా?

336

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య అయితే, ఆయ‌న కంటే ముందే సినిమాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌తను చాటుకున్నారు ఆయ‌న సోద‌రుడు నంద‌మూరి హ‌రికృష్ణ.. ఆరోజుల్లో ఎన్టీఆర్ అన్న‌య్య హ‌రికృష్ణ‌ని తోడుగా ఇచ్చి బాల‌య్య‌ను బ‌య‌ట‌కు పంపి సినిమా షూటింగుల‌కు పంపేవారు. ఇలా అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ అంత అన్యోన్యంగా ఉండేవారు.. అలాంటి హ‌రికృష్ణ తండ్రి ఎలా సినిమాల్లో న‌టించారో అలాగే ముఖానికి రంగువేసుకుని వెండితెర‌పై అద్బుత‌మైన చిత్రాల్లో న‌టించారు. త‌ర్వాత త‌న తండ్రి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అనేక ప‌ద‌వులు నిర్వ‌హించారు.

Image result for harikrishna

ఇక ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి కుటుంబాన్ని తెలుగు ప్ర‌జ‌ల‌ను తీవ్ర విషాదంలో నింపేసింది.. అయితే చ‌నిపోయే స‌మ‌యంలో ఆయ‌న‌కు రెండు తీర‌ని కోరిక‌లు ఉన్నాయి అని చెబుతున్నారు, నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, ఆయ‌న స‌న్నిహితులు. మ‌రి ఆ రెండు కోరిక‌లు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…2014లో స‌మైఖ్యాంద్రా కోసం పోరాటం చేసి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ నాటి నుంచి క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.

Image result for harikrishna

ఇక త‌ర్వాత ఆయ‌న అసెంబ్లీలో అడుగుపెట్టాలని అనుకున్నారు.. కాని ఆయ‌న‌కు ఆ అవ‌కాశం రాకుండా పోయింది.. దీనికి కుటుంబ కార‌ణాలు కొన్ని ఉంటే, రాజ‌కీయ కార‌ణాలు కూడా కొన్ని ఉన్నాయి.. ఆ స‌మ‌యంలో బాల‌య్యను ఎన్నిక‌ల్లో రంగంలోకి దించారు చంద్ర‌బాబు. ఇక ఆ స‌మ‌యంలో పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌ని త‌న మ‌న‌సులో కోరిక చెప్పినా, హరి మాట‌ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఇప్ప‌టికీ తాను అసెంబ్లీకీ మ‌ళ్లీ వెళ్ల‌లేక‌పోయాను అనే బాధ‌తోనే ఆయ‌న ఉండేవారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయ‌న రాజ‌కీయంగా తీసుకున్న నిర్ణ‌యం ఒక‌టే….రాజ్య‌స‌భ ప‌ద‌వికి ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి, రాజ‌కీయాల్లో క్రియాశీల‌కం అవ్వాలి అని అనుకున్నారు. ఏపీ అసెంబ్లీకి మ‌ళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలి అని భావించారు. కాని ఆ కోరిక నెర‌వేర‌లేదు.. అలాగే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టించాలి అని ఆయ‌న కోరిక, ఆ సినిమాలో బాల‌య్య టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఆయ‌న చైత‌న్య ర‌థ‌సారథిగా చెయ్యాలి అని భావించారు కాని అది కూడా తీర‌కుండానే మృతి చెందారు. త‌న తండ్రికి ఆనాడు చైత‌న్య ర‌థ‌సార‌ధిగా ఉన్నాను కాబ‌ట్టి, ఇప్పుడు కూడా ర‌థ‌సార‌ధిగా బాల‌య్య‌కు ఈ బ‌యోపిక్ లో న‌టించాలి అని కోరిక ఉండేద‌ట.. కాని చిత్ర‌యూనిట్ ఆయ‌న్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు అని తెలుస్తోంది. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.