అరవింద సమేత వర్కింగ్ స్టిల్స్ విడుదల.. స్టిల్స్ అదుర్స్..

316

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా అరవింద సమేత.ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అరవింద సమేత

సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి.ముఖ్యంగా ‘పెనివిటి’ సాంగుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేయగా కాల భైరవ పాడారు. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. దీన్ని బట్టి సినిమాలో ఎమోషనల్ టచ్ కూడా కావాల్సినమేర ఉంటుందని స్పష్టమవుతోంది.

ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనేలా

తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సెట్స్‌లో ఎలా వర్క్ చేస్తున్నారు, తొలిసారి కలిసి సినిమా చేస్తున్న వీరి మధ్య వర్కింగ్ బాండ్ ఎలా ఉందో చెప్పేలా విడుదలైన ఈ స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి.