సెట్లో ఎన్టీఆర్ ని ఆలా చూసి ఏడ్చేసిన అరవింద సమేత టీం సభ్యులు

371

హరికృష్ణ చనిపోయి నేటికీ ఐదు రోజులు అవుతుంది.ఆయన మరణ వార్తను సగటు అభిమానియే మర్చిపోలేకపోతున్నాడు.అలాంటిది ఇక ఆయన ఫామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఆయన కొడుకుల పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఎందుకంటే వారు పడుతున్న బాధను చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు.అయితే ఇంత బాధను మనసులో పెట్టుకుని కూడా ఎన్టీఆర్ ఈరోజు అరవింద సమేత షూటింగ్ కు హాజరు అయ్యాడు.మరి ఎన్టీఆర్ వెళ్లిన తర్వాత సెట్ లో ఏం జరిగిందో మీకు తెలుసా..చెబుతా వినండి..

Related image

బాధను మర్చిపోవాలంటే పనిలో నిమ్మగ్నం అవ్వాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు.అందుకే సోమవారం నాడు ఎన్టీఆర్ అరవింద సమెత సెట్ లో అడుగుపెట్టాడు.ఉదయమే షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే ఎన్టీఆర్ ను చుసిన యూనిట్ మొత్తం ఎన్టీఆర్ ను ఎలా పలకరించాలో తెలియక ఆలోచనలో ఉండిపోయింది.అయితే తారక్ అక్కడ ఉన్న వాళ్ళందరిని చాలా క్యాషువల్ గా పలకరించాడంట. అయితే మనసులో చాలా బాధ ఉంది కదా ఎలా యాక్ట్ చేస్తాడా అని అందరు అనుకుంటున్నా సమయంలో తనకు ఇచ్చిన సీన్ పేపర్ ను తీసుకుని కొంచెంసేపు ఆగి తనకు ఇచ్చిన సీన్ ను అద్భుతంగా యాక్ట్ చేశాడంట. తనలోని నటుడు ఎప్పుడు అలాగే ఉంటాడని ఎన్టీఆర్ నటనను చూసి అక్కడి వాళ్ళు చప్పట్లు కొట్టారంట.

తన ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకుని ఎన్టీఆర్ ఇలా ఎలా యాక్ట్ చేశాడంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ కు గురయ్యారంట.చివరికి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా కొద్దిసేపు షాక్ కు గురయ్యారంట. ముందు షూటింగ్ వద్దని త్రివిక్రమ్ చెప్పాడంట కానీ ఎన్టీఆర్ వినకుండా వచ్చేశాడంట.ఇక ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇక తర్వాతి సీన్ కోసం మల్లి ప్రిపేర్ చెయ్యడానికి టీమ్ మొత్తం ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోయారంట.కానీ అంత బాధను మనసులో పెట్టుకుని ఇలా యాక్ట్ చేసిన ఎన్టీఆర్ ను చూసి సన్నిహితులు కొంచెం బాధపడ్డారంట.ఇదండీ హరికృష్ణ చనిపోయిన తర్వాత షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ సెట్ లో అడుగు పెడితే జరిగిన విషయం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తండ్రి చనిపోయిన బాధను గుండెలో పెట్టుకుని కూడా ఇంతలా యాక్ట్ చేసిన విషయం గురించి అలాగే సెట్ లో జరిగిన విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.