త్రివిక్ర‌మ్ కు కొత్త చిక్కులు అరవింద సమేత స్టిల్‌ లీక్

372

టాలీవుడ్ లో లీక్ ల‌ బెడ‌ద ఎక్కువైపోతోంది.. తాజాగా అర‌వింద స‌మేత సినిమాని తెర‌కెక్కిస్తున్న మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కు మ‌రో చిక్కు వ‌చ్చి ప‌డింది.. ఇప్ప‌టికే ఆయ‌న గ‌తంలో అత్తారింటికి దారేది లీక్ తో ఎంతో ఇబ్బంది ప‌డ్డాడు.. ఇక ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఎక్క‌డో ఓచోట ఇలా లీకులు జ‌రుగుతూనే ఉన్నాయి..

Image result for అరవింద సమేత స్టిల్‌
తాజాగా అర‌వింద స‌మేత సినిమా నుంచి లీకైన స్టిల్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Image result for అరవింద సమేత స్టిల్‌

దీంతో ఇక సినిమా లీకుల విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌స్తోంది దీనిపై చిత్ర‌యూనిట్ కూడా కాస్త సీరియ‌స్ అయింద‌ని ఈ ఎడిటింగ్ మొత్తం వ‌ర్క్ చేసిన వారిపై నిఘా వేశార‌ట‌.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు…పూజా హెగ్డే కథానాయికగా, జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు ఈ చిత్రంలో.. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానుల ముందుకు అక్టోబర్‌ 10న రానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ఆగ‌స్టు 15 న విడుద‌ల కానుంది.