‘అరవింద సమేత’ రిలీజ్ డేట్ చెప్పేసిన చిత్ర యూనిట్..

311

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘అరవింద సమేత’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు సమకూర్చిన మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు.

ntr’s aravinda sametha veera raghava release date announced

అయితే ఇప్పటికే విడుదల అయినా టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ‘పెనివిటి’ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది.ఇందులో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తాం అని చెప్పారు.కానీ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేదు.ఇప్పుడు సినిమాను ఎప్పుడు విడుదల చేస్తునంరో డేట్ చెప్పారు.విజయదశమి కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.