బారీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ‘అరవింద సమేత’..ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్

481

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత ’.పూజహేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్ర శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయనే వార్త ఒకటి బయట హల్చల్ చేస్తుంది.

ఈ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏ చిత్ర శాటిలైట్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోలేదు. అంతేకాదు ‘బాహుబలి 2’ తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రమిది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగుందట. చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే రూ.70 నుంచి రూ.80 కోట్ల బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో‘అరవింద సేమత’పై అంచనాలు క్రియేట్ చేయడంపై దర్శక, నిర్మాతలు సఫలమయ్యారు.రాయలసీమ నేపథ్యంలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై డిస్ట్రిబ్యూటర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారట. మరి నిర్మాతలు ఊహించినట్టు థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోతాయో చూడాలి.