దుమ్ము దులిపిన అరవింద సమేత ఫస్ట్ రివ్యూ

318

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలిసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని అభిమానుల్లో కల్పించాయి. తాజాగా యంగ్ టైగర్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతూ పస్ట్ రివ్యూ వచ్చేసింది.మరి సినిమా ఎలా ఉందొ చూద్దామా.

Image result for aravinda sametha songs

ముందు సినిమా కథ విషయానికి వస్తే..ప్రజలే అంత అనుకుని జీవిస్తున్న వ్యక్తి.అతనికి కుటుంబం కన్నా ప్రజల మీద ప్రేమ ఎక్కువ.భార్యాబిడ్డల గురించి కూడా పట్టించుకోడు.దాంతో కొడుకును దూరంగా ఉంచుతుంది అతని భార్య.ఆ కొడుకే ఎన్టీఆర్.అతను రాయలసీమ ఫ్యాక్షన్ కు దూరంగా బతుకుతాడు.అక్కడ అతనికి లవ్ స్టోరీ ఉంటుంది.ఆమె పేరే అరవింద.అయితే హీరోయిన్ అరవిందకు రాయలసీమకు సంబంధం ఏమిటి.ఆమె వలన హీరో జీవితం ఎలా చేంజ్ అయ్యింది.అసలు హీరో హీరోయిన్ కలవడానికి ముఖ్య కారణం ఏమిటి అనేదే స్టోరీ.ఈ సినిమాలో మేజర్ హైలెట్ ఎన్టీఆర్ లుక్, క్యారెక్టరైజేషన్. యంగ్ టైగర్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమా చూస్తున్న వారిలో మరింత ఆసక్తి పెంచుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో క్యారెక్టర్‌ను బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతంగా ఉంది.. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ పీక్స్ అనేలా ఉంది..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఇందులో మరోసారి అద్భుతమైన డైలాగులతో ప్రేక్షకులను మెప్పించాడు. అతడు రాసిన డైలాగులు ప్రేక్షకుల మీద చాలా ఇంపాక్ట్ చూపే విధంగా ఉన్నాయి.త్రివిక్రమ్ సినిమాను నడిపించిన తీరు ది బెస్ట్ అనేలా ఉంది. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ నుండి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. పూజా హెగ్డే కూడా చాలా బాగా చేసింది.‘అరవింద సమేత’ అభిమానులకు ఒక పండగలా ఉంటుంది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, మాస్ స్టోరీ, హై ఆక్టేన్ యాక్షన్, రాకింగ్ మ్యూజిక్, సూపర్ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ సినిమాకు మేజర్ హైలెట్స్. ఈ దసరాకు పర్ఫెక్ట్ గిఫ్ట్.ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3.5