‘అరవింద సమేత’ లో ఐదవ సాంగ్ ఉందంట..సర్ప్రైజ్ గా విడుదల చెయ్యబోతున్నారు..

308

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘అరవింద సమేత’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు సమకూర్చిన మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు.

Image result for aravinda sametha working stills

అయితే ఇప్పటికే విడుదల అయినా టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ‘పెనివిటి’ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది.సినిమా అక్టోబర్ 11 న విడుదల అవ్వనుంది.అయితే ఈ సినిమాలో 4 పాటలు విడుదల చేశారు.అయితే ఇందులో ఇంకొక స్పెషల్ సాంగ్ ఉండబోతుందంట.

1

ఆడియో ట్రాక్ లో లేని ఐదో పాట సినిమాలో ఉంటుందని అంటున్నారు.ఈ పాట ఎన్.టి.ఆర్ డ్యాన్సింగ్ ఐటం అని తెలుస్తుంది. సాంగ్ కచ్చితంగా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఖుషి చేస్తుందని అంటున్నారు.ఈ సాంగ్ లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ చేస్తుందంట.మరి సర్ ప్రైజ్ గా ప్లాన్ చేసిన అరవింద సమేత ఐదో పాట నిజంగానే ఫ్యాన్స్ కు థ్రిల్ కలిగిస్తుందా లేదా అన్నది చూడాలి.