ఏడుస్తూ కృష్ణ జగన్ కు ఏం చెప్పాడో తెలిస్తే కన్నీళ్లాగవు

172

గుండెపోటు కారణంగా బుధవారం రాత్రి మరణించిన విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం నానక్ రాంగూడలోని నివాసంలో సందర్శనకు ఉంచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు చిరంజీవి, మోహన్ బాబు, ఇతర తెలుగు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం సందర్శించి నివాళులు అర్పించారు. శోక సముద్రంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణను ఈ సందర్భంగా జగన్ ఓదార్చారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు అందరి చేత కన్నీరు పెట్టిస్తుంది.

AP CM Jagan visits Late Vijaya Nirmala

జగన్ ఇంటికి వెళ్ళగానే నరేష్ అతనికి స్వాగతం పలికాడు.అక్కడ విజయనిర్మల పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించాడు జగన్. ఇక అక్కడి నుంచి మేడపైన ఉన్న కృష్ణ దగ్గరకు జగన్ వెళ్ళాడు. అక్కడ కృష్ణ ఏడుస్తూ ఉండటం చూసి జగన్ ఓదార్చాడు. మీరు గుండెను రాయిని చేసుకోవాలి సర్. మీరు ఈ క్షణాన ఎక్కువగా బాధపడటం మంచిది కాదని అన్నాడంట. అయితే విజయనిర్మల లేకుండా తాను ఉండలేనని కృష్ణ చెప్పడంతో జగన్ నోటా మాటరాలేదు. ఇక అక్కడే ఉన్న నరేశ్ కల్పించుకుని..జగన్ అన్నా రాజశేఖర్ రెడ్డి అన్నా అమ్మకు చాలా ఇష్టం అని చెప్పడమే కాకుండా విజయనిర్మల ఇంట్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఫోటో చూపించాడు. ఆ ఫొటోకు పూలమాల వేసి ఉంది. ఈ ఫోటోను చూస్తే చెప్పొచ్చు జగన్ ఫామిలీ అన్నా, రాజశేఖర్ రెడ్డి అన్నా విజయనిర్మలకు ఎంత ఇష్టమో.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక విజయ నిర్మల దహన సంస్కారాలు చిలుకూరులోని విజయ్ కృష్ణ గార్డెన్స్‌లో శుక్రవారం జరుగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లకుండా చిలుకూరులో ఉన్న విజయకృష్ణ గార్డెన్స్‌కు పూలరథంలో అమ్మను తీసుకెళతామని నరేష్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు అంతిమ యాత్ర మొదలవ్వాల్సి ఉండగా…. చిలుకూరులో కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం, ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారనే సమాచారం కూడా ఉండటంతో కాస్త ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. విజయ నిర్మల అంతిమ యాత్రలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ అశృనయనాల మధ్య పూల రథంలో విజయ నిర్మల పార్థివ దేహాన్ని చిలుకూరు తరలిస్తున్నారు. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి, హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా పేర్కొంటున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం. అలాగే జగన్ కృష్ణల మధ్య జరిగిన సంభాషణ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.