బిగ్ బాస్ షో పై జగన్ సంచలన నిర్ణయం

1582

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అభిమానులు నిన్నటి నుంచి కూల్ అయ్యారు.. అవును బిగ్ బాస్’ సీజన్ 3 నిరీక్షణకు తెరపడింది. ఆదివారం రాత్రి 9 గంటలకు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సందడి మొదలైపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. ఇప్పటికే టీవీ షో హోస్ట్‌గా అనుభవాన్ని సంపాదించిన నాగార్జున.. ఈ ‘బిగ్ బాస్’ను కూడా అదే స్టైల్లో హోస్ట్ చేస్తున్నారు. ‘కింగ్’లో పాటతో బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఫస్ట్ సీజన్ హోస్ట్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ వ్యాఖ్యాత నానిని గుర్తుచేసుకున్నారు. ‘నా పెద్ద కొడుకు’ అని ఎన్టీఆర్‌ను.. ‘నా గోల్డ్’ అంటూ నానిని సంబోధించారు. ఆ తరవాత బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి పరిశీలించారు.

Image result for jagan

హౌజ్‌లోకి నాగార్జునకు ఆహ్వానం పలికిన బిగ్ బాస్ ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. 15 మంది కంటెస్టెంట్లలో మొదటి ముగ్గురినీ ఎంపిక చేయాలని నాగార్జునకు సూచించారు. బిగ్ బాస్ సూచన మేరకు మూడు చిట్టీలను తీసి ముగ్గురు కంటెస్టెంట్లను నాగార్జున ఎంపిక చేశారు. ఈ ముగ్గురిలో మొదటిగా యాంకర్ శివజ్యోతి అలియాస్ ‘తీన్మార్’ సావిత్రిని వేదికపైకి పిలిచారు. ఆ తరవాత టీవీ నటుడు రవికృష్ణను రెండో కంటెస్టెంట్‌గా.. సోషల్ మీడియా సెన్సేషన్, నటి అశురెడ్డిని మూడో కంటెస్టెంట్‌గా ఆహ్వానించారు. ఆ తరవాత జర్నలిస్టు జాఫర్‌ను పరిచయం చేశారు. ఐదో కంటెస్టెంట్‌గా నటి హిమజ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. 14, 15 కంటెస్టెంట్లుగా వచ్చిన హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బిగ్ బాస్ హిస్టరీలో ఒక కపుల్ కంటెస్టెంట్స్‌గా రావడం ఇదే తొలిసారి మరో విశేషం. అయితే నాణానికి అంతా ఇది ఒకవైపు అని చెప్పాలి..ఈ షో పై ముందు ఎన్నో విమర్శలు వచ్చాయి.

Image result for big boss show 3

యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా.. కమిట్మెంట్ పేరుతో తమను వేధించారంటూ బిగ్‌బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తర్వాత హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ కోర్టు జోక్యంతో బిగ్‌బాస్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు అంటుకుంటోంది. బిగ్‌బాస్ షోపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Image result for jagan

కన్నా తన ట్వీట్లో బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. నేరుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ‘బిగ్ బాస్-సిరీస్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ షో భారతీయ సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించి యువతను పక్కదారి పట్టించేలా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా పర్మిషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అన్నారు.

ఈ క్రింద వీడియోని చూడండి

కన్నా లక్ష్మీనారాయణ ఈ ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో పాటూ తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ బిగ్‌బాస్‌పై చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. బీజేపీ భావజాలం ఇలాంటి రియాల్టీ షోలకు వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పాలి. అలాగే బీజేపీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాలో ఉంది. కాబట్టి రాజకీయంగా కూడా మైలేజ్ కోసం బిగ్ బాస్‌ను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం ఈ వివాదంపై స్పందించ లేదు. సో ఇది సోషల్ ప్రోగ్రాం అని దీనికి రాజకీయ రంగు పులమద్దు అని చెబుతున్నారు అభిమానులు.. మరి దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేసేది లేదు అని కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు. మరికొందరు దీనిని ఏపీలో నిలిపివేస్తారు అని అంటున్నారు.. సో రెండు ప్రభుత్వాలు దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తాయో వేచిచూడాల్సిందే. మీరేమంటారు మీ అభిప్రాయం కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి.