బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్న ‘సైరా’

234

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ‘సైరా’ సినిమా రూపొందుతోంది.

Image result for saira narasimha reddy

నయనతార అమితాబ్ బచ్చన్ సుదీప్ లాంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో బిగ్ సర్‌ప్రైజ్ ఉండనుందని సమాచారం.

Image result for chiru anushka

‘సైరా’లో గెస్ట్ రోల్‌లో అనుష్క నటిస్తోందని సమాచారం. ఇప్పటికే ఆమెను ఈ విషయమై రామ్ చరణ్ సంప్రదించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో చిరు నటించిన ‘స్టాలిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించిన అనుష్క.. ‘సైరా’ను ఓకే చేస్తే రెండోసారి అలరించినట్టవుతుంది.