ప్రభాస్ తో మళ్లీ రొమాన్స్ కు సిద్ధపడ్డ అనుష్క..

317

ప్రభాస్-అనుష్క.. తెలుగులో మోస్ట్ పాపులర్ జంటల్లో వీరెప్పుడూ ముందే ఉంటారు. ప్రభాస్‌తో అనుష్క.. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి-2 చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై రెండు కుటుంబాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

Related image

అయితే అనుష్క సినిమాలు తగ్గించడంతో ఈ జంటను మళ్ళి మనం చూడలేం అని అనుకున్నాం. కానీ వీరిద్దరూ త్వరలో ఒక సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’లో నటిస్తున్నాడు. దీని తర్వాత ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇందులో పూజా హెగ్దే కథానాయిక. ఈ చిత్రంలో అనుష్క ప్రత్యేక పాత్రలో నటించనుందట.

Related image

ప్రభాస్‌తో రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్ నెట్ ల వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి సూపర్ హిట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు అప్పుడే ఖుషీ అయిపోతున్నారు. దీనిపై యూనిట్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.