నాని కి జోడీగా అను కజిన్..!

396

మళయాల కుట్టి అను ఇమాన్యుయేల్ పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని టైప్ లో ఉంది..కెరీర్ మొదట్లో పెద్ద హీరోలతో చాన్స్ కొట్టేసిన అను మంచి గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు..నాని తో మజ్ను సినిమాలో అరంగేట్రం చేసిన ఈ భామకు మంచి హిట్ వచ్చింది..ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, బన్నీ తో నా పేరు సూర్య లో నటించినప్పటికీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడం తో ఆమె పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక లా అయిపోయింది..ఇప్పుడు నాగ చైతన్య తో మారుతి రూపొందిస్తున్న శైలజా రెడ్డి అల్లుడి పైనే ఆమె ఆశలన్నీ ఉన్నాయి..ఈ సినిమా హిట్ అయితేనే ఆమెకు చాన్సులు ఇస్తామని నిర్మాతలు ప్రకటించారంటే ఆమె పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు..

ఇదిలా ఉండగా అను ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ తెరంగేట్రం చేయబోతుందని సమాచారం..అనూ ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బా మోనికా జాన్ని నాని కి జోడీగా జెర్సీ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది..బాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా కజిన్ పరిణీతి చోప్రా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. అదే తరహాలో టాలీవుడ్ లో కజిన్ కల్చర్ ను అను స్టార్ట్ చేయబోతోంది. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కబోతోన్న‘జెర్సీ’లో అనూ ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బా మోనికా జాన్ ను ఎంపిక చేశారట. తమిళంలో రెండు మలయాళంలో రెండు సినిమాల్లో ఆల్రెడీ హీరోయిన్గా నటించిందట. అయితే ఈ అక్కా చెల్లెళ్లిద్దరూ నాని సినిమాతోనే తెరంగేట్రం చేయడం విశేషం. అను ఇమ్మాన్యుయేల్ ఫస్ట్ మూవీ ఆఫర్ ‘ఆక్సీజన్’. కానీ మజ్ను ముందుగా విడుదలైంది. మరిఅక్క లాగా కాకుండా ఈ చెల్లెలికి టాలీవుడ్ లో లక్ కలిసొస్తుందేమో వేచి చూడాలి.